కడప జిల్లా రామాపురం మండలంలోని గురుకుల పాఠశాలకు ఎదురుగా ఉన్న మల్లిక స్వగృహంలో ఈ నెల 3వ తేదీన హత్యకు గురైనట్లు పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకర్ల ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలు వెళ్లడించారు. మృతురాలు మల్లికతో నిందితులు టి.వెంకటరమణ, నాగరాజు వివాహేతర సంబంధాలు కొనసాగించేవారు. మల్లిక వీరిని గాక వేరే వారితో కూడా వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానంతో పథకం ప్రకారం …
Read More »మళ్లీ భారి వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అధికారులు
బంగాళాఖాతంలోని తూర్పు మధ్య ప్రాంతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నాయని.. ఇది ఉత్తర కోస్తాంధ్ర లేదా ఒడిశా వద్ద తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి తెలిపారు. ఉత్తర కోస్తా వద్ద తీరం దాటితే తెలంగాణలో 19వ తేదీ నుంచి వర్షాలు మళ్లీ బాగా పెరిగే సూచనలున్నాయి. దీనిపై ఈ నెల 18 నాటికి పూర్తి అంచనాలు వెలువడతాయి. ప్రస్తుతం రాయలసీమ మీదుగా కర్ణాటక వరకూ …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం..బైక్‌ను కారు ఢీకొట్టడంతో… ఫ్లై ఓవర్‌పై నుంచి కింద పడి
కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు వంతెనపైనుంచి పడి మృతి చెందారు. ఈ ఘటన బొమ్మనహళ్లి సమీపంలోని గారేబావి పాళ్య వద్ద శనివారం చోటు చేసుకుంది. మడివాళ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు… మహ్మద్ హుసేన్(36), ఫకృద్ధీన్(34) అనే వ్యక్తులు శనివారం మడివాళ వైపు నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వైపు బైక్‌లో వెళ్తుండగా భారీ వర్షం …
Read More »నారాయణ విద్యాసంస్థలను మూసేయించండి’ అంటూ లేఖ రాసి ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
‘నారాయణ కళాశాలలు విద్యార్థుల పాలిట నరక కూపాలుగా మారాయి. దయచేసి నారాయణ విద్యాసంస్థలను మూసేయించండి’ అంటూ లేఖ రాసి ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 11న బండ్లగూడలోని నారాయణ కాలేజీకి వెళ్లిన సాయి ప్రజ్వల తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. ప్రజ్వల ఆచూకీ తెలీకపోవడంతో …
Read More »పెళ్లయిన హీరోతో పీకల్లోతు ప్రేమలో…సాయి పల్లవి
ఫిదా సినిమాతో అభిమానులు సాయి పల్లవికి ఫిదా అయిపోతున్నారు. సాయి పల్లవి ముద్దు మాటలు, ఎక్స్‌ప్రెషన్స్ తెలుగు ప్రేక్షకులను ఆమెకు పిచ్చ ఫ్యాన్ చేసేశాయి. ఇదిలా ఉంటే ఎంత తక్కువ టైంలో సాయి పల్లవి సూపర్ హీరోయిన్‌గా పాపులర్ అయ్యిందో అంతే త్వరగా ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. తెలుగులో ఆమె చేసిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఫిదా షూటింగ్ టైంలో ఆమెకు హీరో వరుణ్‌తేజ్‌కు గొడవ జరిగింది. అదలా …
Read More »ఇంత అధ్వాన్నంగా ఉన్నాయన్నమాట హైదరాబాద్ నగర రోడ్లు
గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. ఈ రహదారులపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత అధ్వాన్నంగా ఉన్నాయన్నమాట హైదరాబాద్ నగర రోడ్లు.గత పది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు సిటీ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. వానొస్తుందంటే భయపడే పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి వర్షాలకు రోడ్లే కొట్టుకుపోతున్నాయి. గుంతలు, పగుళ్లు వచ్చిన రోడ్ల కారణంగా వాహనదారులు గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోవాల్సి వస్తోంది. పరిస్థితులు …
Read More »జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే చంద్రబాబు భయంతో మైండ్‌గేమ్
వచ్చె నెల నవంబర్ 2 నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర విజయవంతమవుతుందనే భయంతో సీఎం చంద్రబాబు పార్టీ ఫిరాయింపులతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. ఆమె శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే సీఎం ప్రలోభాలు, ప్యాకేజీలతో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జగన్ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని, పాదయాత్రతో ఆయనకు మరింత …
Read More »గిద్దలూరు వీరజవానుకు కన్నీటి వీడ్కోలు… వేలాది మంది ప్రజలు
జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని దుండగల్ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తూ ఈనెల 12న పాక్ సైనికుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాను తల్లపురెడ్డి రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురంలో జరిగాయి. సైనికులకు ఆయుధాలు సరఫరా చేసేందుకు వెళ్తున్న వాహనంపై పాక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్న రామకృష్ణారెడ్డి తలనుంచి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతను వెంటనే కుప్పకూలాడు. దగ్గరగా …
Read More »కర్నూలు జిల్లా ఘోరం…ఉయ్యాలవాడ ఏఎస్సై మృతి
కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడు వద్ద 40వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనం డివైడరును ఢీకొన్న ఘటనలో ఏఎస్సై మృతి చెందారు. స్థానిక ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. ఉయ్యాలవాడ ఏఎస్సైగా పనిచేస్తున్న రాధాకృష్ణ (50) శనివారం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై చాగలమర్రికి తిరుగు పయనమయ్యారు. నగళ్లపాడు సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తూ డివైడరును ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. …
Read More »కలెక్టర్ ఆమ్రపాలిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహాం..కారణం ఇదే…?
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు వరంగల్ నగర అభివృద్ధిపై జిల్లా కలక్టరేట్‌లో అధికారులతో జరిపిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారుల పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఎందుకు ఖర్చు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. అయితే ఈ సమీక్ష లో వరంగల్ …
Read More »