భర్తను కాదనుకొని వెళ్లిన ఓ వివాహితను ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కానాలకు చెందిన సుబ్బ లక్ష్మమ్మ కూతురు శాంతమ్మ, అదే గ్రామానికి చెందిన రాజేష్ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి శాంతమ్మను ఓ వ్యక్తికి ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే పెళ్లైన 10 …
Read More »ఐపీఎల్-2020 సీజన్ తొలి మ్యాచ్ ..వివరాలు
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీయల్-2020 సీజన్‌ను వచ్చే ఏడాది మార్చి 29న ప్రారంభించనున్నారు. ఈ మేరకు సమాచారాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అంతేకాకుండా తొలి లీగ్ మ్యాచ్‌ను ముంబయిలోని వాఖండే స్టేడియంలో జరుగనున్నట్లు కూడా ఆ అధికారి తెలిపారు. వాఖండేలో తొలి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆడనుండగా.. మరో జట్టు వివరాలు ఇంకా తెలియరాలేదు. ఏప్రిల్ …
Read More »రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 మన రాష్ట్ర చరిత్రనే మేలిమలుపు తిప్పిన సంవత్సరంగా గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా 2020 గుర్తుండిపోవాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న న్యూ ఇయర్ వేడుకల్లో ఆయన రాత్రి 7.40 …
Read More »దేశ రాజధానిలో తెలుగు వైద్యుల అదృశ్యం..ఆచూకీ కనిపెట్టాలని ఫిర్యాదు
దేశ రాజధానిలో తెలుగు వైద్యుల అదృశ్యం మిస్టరీగా మారింది. ఈ నెల25న డాక్టర్ హిమబిందు(29), డాక్టర్ దిలీప్ సత్య(28) ఢిల్లీలో అదృశ్యమయ్యారు. కాగా హిమబిందు భర్త డా. శ్రీధర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిలీప్, హిమబిందు, శ్రీధర్ ఈ ముగ్గురు కర్నూల్ మెడికల్ కళాశాలలో కలిసి చదువుకున్నారు. చండీగఢ్‌లో చిన్న పిల్లల వైద్యునిగా దిలీప్ పనిచేస్తున్నారు. ఈ నెల 24న పుదుచ్చేరిలోఇంటర్వ్యూకి వెళ్లి 25న తిరిగి వస్తుండగా …
Read More »దారుణం..అక్రమ సంబంధం ..ఒకే గదిలో ఆత్మహత్య
చిత్తూరు జిల్లా పీలేరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పీలేరు శివార్లలోని ఓ గదిలో వీరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అమరావతి, శ్రీనివాసులుగా గుర్తించారు. వీరిద్దరూ వివాహితులే. వేర్వేరు పెళ్లిలు చేసుకున్న వీరు కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం గదిలోకి వెళ్లిన ఇద్దరు అన్ని తలుపులు వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరు ఎంతకూ …
Read More »దివాకర్ బస్సు అనుమతిలేని రూట్లో వస్తుండగా సీజ్
రవాణాశాఖ అనుమతులు లేని రూట్లలో తిరుగుతున్న దివాకర్ బస్సును మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్లు సీజ్ చేశారు. అక్రమంగా తిరుగుతున్న బస్సులను గుర్తించడంలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లాకు చెందిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు నాయక్, మధుసూధన్‌రెడ్డి, మణి, అనంతపురం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ నరసింహులు వివిధ రూట్లలో వాహనాలపై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఏపీ 39 ఎక్స్7699 నంబర్ గల దివాకర్ బస్సు అనుమతిలేని రూట్లో వస్తుండగా …
Read More »అమరావతి దెబ్బ ఆ సినీ ప్రముఖులకు భారీ షాక్.. హీరో ఆరు వందల ఎకరాలు..నిర్మాత 380 ఎకరాలు
అమరావతిని రాజధానిగా ఒప్పుకునేందుకు మొదటి నుంచి ఇష్టపడని జగన్ తాను అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదు.ఆ తరువాత ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తానంటూ సీఎం జగన్ ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లోనూ, నాయకుల్లోనూ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.తాజాగా బయటపడిన విషయం ఏంటి అంటే అమరావతిని నమ్ముకుని టాలీవుడ్ కు చెందిన హీరోలు, నిర్మాతలు చాలామంది దెబ్బతిన్నారనే సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. …
Read More »వీరిద్దరిలో ప్రవహించేది నారక్తం..పవన్ రక్తం కాదు..రేణుదేశాయ్ సంచలన పోస్ట్
పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక తన ఇద్దరి పిల్లలతో కలిసి జీవిస్తున్నారు రేణుదేశాయ్. ఒంటరిగా పిల్లల్ని పెంచుతూ.. వాళ్లు చేసే అల్లరిని, వారి సరదా సంగతుల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు రేణూ దేశాయ్. బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరిస్తూ అభిమానులకు దగ్గరగానే ఉన్న రేణూ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పూణేలో ఉంటున్నారు. తాజాగా కొడుకు అకీరా తన చెల్లెలు ఆద్యని ఎత్తుకొని …
Read More »చెస్ చాంపియన్ కోనేరు హంపికి సీఎం జగన్ అభినందనలు
ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని సీఎం ఆకాంక్షించారు. కాగా శనివారం ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ లో హంపి మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన …
Read More »కర్నూలులో ‘థ్యాంక్యూ సీఎం జగన్ సర్’
కర్నూలులో ఆదివారం ‘థ్యాంక్యూ సీఎం జగన్ సర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 3వేల మంది వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ‘థ్యాంక్యూ సీఎం సర్’ ఆకారంలో నిలబడి తమకు ఉద్యోగాలు ఇచ్చి భరోసా కల్పించారంటూ వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వలంటీర్లు, ఉద్యోగుల చేత ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి జిల్లా పరిషత్ …
Read More »