వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …
Read More »ఆ భయంతోనే ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్నా..తేజ
నందమూరి అభిమానులకే కాదు, తెలుగు సినీ అభిమానులకు కూడా ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రతిష్టాత్మకమైన దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) బయోపిక్ చిత్రం నుంచి దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇటివలే ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవం మార్చి 29న హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో ఎన్.బి.కే ఫిలింస్ పతాకంపై విబ్రి మీడియా సమర్పణలో ఈ చిత్రం …
Read More »హైదరాబాద్ బయలుదేరిన బస్సులో ..!
బెంగళూరు నుంచి బుధవారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ బయలుదేరిన కేఎస్‌ఆర్టీసీ బస్సు ‘ఐరావతం’ మంటల్లో చిక్కుకుంది. ప్రమాదాన్ని సకాలంలో గుర్తించడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. బస్సు బయలుదేరిన గంటలోగానే నగర శివార్లలోని దేవనహళ్లి వద్ద ఇంజిన్‌లో మంటలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే సిబ్బందిని, ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ఆ సమయంలో సిబ్బందితోపాటు బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. వారంతా వేగంగా వాహనం దిగడంతో ముప్పుతప్పింది. అగ్నిమాపక దళాలు …
Read More »నేడు ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు..!
టీడీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యుడు ఆనం వివేకానందరెడ్డి(67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఏడాదిగా వివేకానందరెడ్డి వీర్యగ్రంథి (ప్రొస్టేట్) కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమంగా మారడంతో ఈ నెల 13న కుటుంబసభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. గత …
Read More »ఏపీలో రైల్వే టీసీతో తీవ్ర వాగ్వివాదానికి దిగిన జబర్దస్త్ టీం..!
హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో జబర్దస్త్ టీం సభ్యులు హల్‌చల్ చేశారు. విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు జనరల్ టికెట్ తీసుకుని థర్డ్ క్లాస్ ఏసీలో ప్రయాణం చేశారు. చెకింగ్ కు వచ్చిన టీసీ అభ్యంతరం చెప్పడంతో జబర్దస్త్ టీం సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. దీంతో టీసీ ఈ విషయం గురించి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత మళ్లీ …
Read More »పాదయాత్రలో ఆసక్తికర సంఘటన “జగన్ ఫిదా”..ఫేస్ బుక్ పేజీలో పోస్ట్..!
ప్రజాసంకల్పయాత్రలో 145వ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.పాదయాత్రలో ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. వేలాది మంది ప్రజలు వైఎస్ జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. ఈక్రమంలోనే పాదయాత్రలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఆ విషయాన్ని వైఎస్ జగన్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఆయన తన ఫేస్ బుక్ పేజీలో – ” కొన్ని జ్ఞాపకాలు గుండెల్లో …
Read More »షాక్ న్యూస్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గంభీర్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11లో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు గంభీర్ ప్రకటించాడు. ఐపీఎల్ పదకొండో సీజన్‌ను ఢిల్లీ టీమ్ మరీ దారుణంగా ప్రారంభించింది. ఆడిన 6 మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా సక్సెసైన గంభీర్.. అదే ఫామ్‌ను ఢిల్లీ టీమ్‌తో కొనసాగించలేకపోయాడు. ఆరు మ్యాచుల్లో గంభీర్ 85 రన్స్ మాత్రమే చేశాడు. …
Read More »ఐపీఎల్ లో హోస్ట్‌గా తెలుగమ్మాయి..!
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్-11 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్-11లో భాగమైంది ఓ తెలుగమ్మాయి. మొదట న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ఆరంభించి అటుపై యాంకర్‌గా మారి ఇపుడు ఐపీఎల్ లో హోస్ట్‌గా క్రికెట్ అభిమానులను అలరిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు హైదరాబాద్ వాసి వింధ్య విశాఖ. ప్రోకబడ్డీకి వచ్చిన విశేష స్పందనతో ఐపీఎల్ 11లో కూడా తొలిసారిగా తెలుగు కామెంటరీకి శ్రీకారం చుట్టింది స్టార్ సంస్థ. 20 మంది …
Read More »శ్మశానవాటికను కూడా కబ్జా చేసిన టీడీపీ నేతలు..!
ఏపీలో టీడీపీ నేతలు విచ్చలవిడిగా భూకబ్జాలు చేస్తున్నారు. అడ్డపడిన వారిని దారుణంగా మహిళలు అని చూడకుండ వారిపై దాడి చేస్తున్నారు. తాజాగా అధికారం అండగా ఉందని టీడీపీ నేతలు శ్మశానవాటికను సైతం వదల కుండా కబ్జా చేశారు. వాళ్లు నిర్మిస్తున్న అపార్టుమెంట్ కోసం శ్మశానవాటిక గుండా రోడ్డు వేస్తున్నారు’ అంటూ గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన కిషోర్‌బాబు జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా …
Read More »మంచు విష్ణుకు రోడ్డు ప్రమాదం..వీడియో వైరల్
టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ . ఈ సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా ఓ యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ సమయంలో విష్ణు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడ్డారు. కాలికి, భుజానికి గాయాలయ్యాయి. ఆయన వెనుక కూర్చున్న ప్రగ్యాకు కూడా …
Read More »