Home / siva (page 232)

siva

 వందలాది మంది సమక్షంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి డీఎస్పీపై తిట్ల దండకం

ఎంపీ అయిు ఉండి, బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేత సంయమనం కోల్పోయారు. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. నా ధోరణి ఇంతే అన్నట్లు పోలీసులపై నోరు పారేసుకున్నారు. మూడు రోజులుగా పోలీసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో ఒళ్లంతా కళ్లు చేసుకుని పహారా కాస్తున్నారు. మొదటి రోజు ఘటనలో తప్పులు ఎవరిదనే విషయం పక్కనపెడితే.. రెండవ రోజు ఎంపీ జేసీ రంగప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తతకు …

Read More »

ప్రణయ్‌ ప్రతిరూపం కోసమే బ్రతికున్నా….అమృత..!

ప్రణయ్‌ మృతదేహం వద్ద అమృత రోదనలు మిన్నంటాయి. ప్రణయ్‌ మృతదేహాన్ని చూసిన అమృత, నేను గర్భవతి కాకపోయినట్లయితే, నేను కూడా నీ దగ్గరికే వచ్చేదాన్ని అంటూ విలపించటం చూసి ఆమెను ఓదార్చటం ఎవరికీ సాద్యం కాలేదు. తన కడుపులో పెరుగుతున్న ప్రణయ్ ప్రతిరూపం కోసమే బ్రతికున్నానని తెలిపింది. అయితే తమ ప్రేమకు గుర్తుగా , తనకు పుట్టబోయే బిడ్డను అపురూపంగా పెంచుకుంటానని అమృత తెలిపింది.

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబు బందోబస్తు కోసం బెల్జియం నుంచి డాగ్ స్వ్కాడ్‌

శ్రీశైల జలాశయ పర్యటనకు వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా బాంబ్‌ స్వ్కాడ్‌ పోలీసులు విదేశీ శునకంతో తనిఖీలు చేపట్టారు. బెల్జియం మెల్నాయిస్‌కు చెందిన శునకాన్ని శ్రీశైలం బందోబస్తులో వినియోగిస్తున్నారు. డానీగా పిలువబడే ఈ శునకాన్ని నెల్లూరు జిల్లా నుంచి పోలీసులు తీసుకువచ్చారు. శిక్షణలో భాగంగా పేలుడు పదార్థాలను గుర్తించి ఈ శునకం మొదటి బహుమతి పొందినట్లు పోలీసులు …

Read More »

అద్బుతమైన విఎఫ్‌ఎక్స్‌ తో 2. ఓ టీజర్‌ విడుదల..!

2. ఓ టీజర్‌:……..సినీ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న రోబో 2.ఓ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదలైంది. దిగ్గజ దర్శకుడు శంకర్ , లైకా ప్రొడక్షన్స్ తో రూపొందుతున్న చిత్రం రోబో 2.ఓ . సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, హాలీవుడ్ నటి అమీజాక్సన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. సుమారు 545 కోట్లతో , అద్బుతమైన విఎఫ్‌ఎక్స్‌ తో …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో పండగపూట పెను విషాదం..!

ఇంట్లో కేబుల్‌ వైరు లాగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ హృదయవిదారక ఘటన గురువారం ఉదయం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడిలో చోటు చేసుకుంది. మృతిచెందిన వారిలో ఏసు(26), సాల్మన్‌ రాజు(5), ఎస్తేరు(3) వున్నారు. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన ఏసు తన కుటుంబంతో కలిసి బుధవారం బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి …

Read More »

వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల..ఫ్యాన్స్ కు పండగే

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్రను ‘యాత్ర’ పేరుతో సినిమాగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్‌ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. మహి వి.రాఘవ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ‘యాత్ర’ చిత్రాన్ని వైఎస్‌ఆర్‌ తనయుడు, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. …

Read More »

రైతు బంధువు ప్రభుత్వం కావాలా… రాబంధులు కావాలా

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎల్ రమణలు ఇద్దరు గడ్డపోళ్లు ఒక్కటయ్యారు. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. జగుస్సాకరమైన, నీచమైన ఆ రెండు పార్టీల కలయిక వల్ల ప్రజలకు ఒక సువర్ణావకాశం దొరికింది. 65 ఏళ్లు రైతులను రాబందుల్లా పీక్కుతిన్న వాళ్లు రావాలా….రైతు బంధువుగా మారిన ప్రభుత్వం రావాలో తేల్చుకునే సమయం వచ్చింది. …

Read More »

అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకొని రేసు గుర్రంలా పరిగెడుతున్న నాయకుడు..కేసీఆర్‌

రాజకీయంగా ప్రజలు తనను మరచిపోతున్న సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అండగా నిలవాలని కోరారని, అందుకే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ శాసనసభాపతి సురేశ్‌ రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం ఆయన కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ… మళ్లీ టీఆర్ఎస్ లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అభివృద్ధి చేయాలనే స్పష్టమైన లక్ష్యం …

Read More »

ట్రక్కు చక్రాల కింద పడి నుజ్జునుజ్జయిన బైక్ ..మహిళ అదృష్టవంతురాలు

చైనాలో ఓ మహిళ పెను ప్రమాదం బారిన పడి అదృష్టవశాత్తూ గాయాలు కాకుండా తప్పించుకుంది. ఈ సంఘటనను చూసిన చుట్టుపక్కల వారికి ఇది ఓ విచిత్రంలా తోచింది. చైనాకు చెందిన పీపుల్స్‌ డైలీ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మలుపు తిరుగుతుండగా.. అదే దిశలో మలుపు తీసుకుంటున్న ఓ భారీ ట్రక్కు ఆమెను వెనుక నుంచి …

Read More »

వైఎస్‌ జగన్‌ వినాయకచవితి శుభాకాంక్షలు..!

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి దీవెనలతో అభివృద్ధిపరంగా ఇరు రాష్ట్రాలకు, ఇరు రాష్ట్రాల ప్రజలకు విఘ్నాలు తొలగి ఇకమీదట అనేక విజయాలు సిద్ధించాలని ఆయన కోరుకున్నారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయం నుంచి బుధవారం ప్రకటన వెలువడింది.కాగా, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ బుధవారం విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat