అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేశవ్ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. పయ్యావుల రాజీనామాను ఆమోదించిన శాసన మండలి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున …
Read More »అనంతలో పరిటాల వర్గీయులు బాంబులు వేస్తాం, కొడవళ్లతో నరికి చంపేస్తామంటున్న ఆడియో లీక్
ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయినా టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల ఆగడాలు ఆగడం లేదు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం గుంతపల్లిలో పరిటాల శ్రీరామ్ అనుచరులు రెచ్చిపోయారు. వైసీపీ కార్యకర్త ప్రతాప్‌కు ఫోన్ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాయలేని అసభ్య పదజాలంతో బాంబులు వేస్తామని, కొడవళ్లతో నరికి చంపేస్తామంటూ శ్రీరామ్ అనుచరుడు అమర్నాథ్, మరో ముగ్గురు బెదిరింపులకు దిగారు. ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు …
Read More »ఎక్కడినుంచి గెంటేశారో అక్కడికే రాజులా వచ్చిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీనేతలు జగన్‌కు స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి జగన్ ప్రత్యేక కాన్వాయ్‌లో శారదా పీఠానికి చేరుకున్నారు. శారదాపీఠంలో వేదపండితులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అయితే గత సంవత్సరంలో ఇదే విశాఖ విమానశ్రయంలో వైఎస్ జగన్ అడ్డుకున్న పోలీసుల నేడు ముఖ్యమంత్రిగా …
Read More »ముద్దు సీన్స్ లో రెచ్చిపోయిన ..రెజీనా
టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రెజీనా. అంతే క్రిందకు అంటే స్పీడ్ గా జారిపోయింది. ఇండస్ట్రీలో మెగా హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు. మొదట్లో పెద్ద సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ… తరువాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేకపోయింది. ఏవో చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కృష్ణవంశీ నక్షత్రం సినిమా తరువాత ఆమెకు సినిమా లేదు. ప్రస్తుతం రెజీనా …
Read More »వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన గాన కోకిల
ఎప్రిల్ నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా గాన కోకిల పి. సుశీల ఆయనకు అభిందనలు తెలిపారు. ప్రజల దీవెనతో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్‌కు తన ఆశీస్సులు అని ఆమె పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో తమ …
Read More »స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకున్నారు. పూర్ణకుంభంతో వేదపండితులు ఆయనకు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం వైఎస్ జగన్ స్వరూపానందేంద్ర స్వామి వారికి కానుకలు సమర్పించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకుని.. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. మరికాసేపట్లో సీఎం తిరుగుపయనమవుతారు. పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు ఆశ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి 10 వేలకు పెంచుతూ …
Read More »దొంగ ఏడుపులు వద్దని హెచ్చరించిన ..విజయసాయి రెడ్డి
అనంతపురం జిల్లాలో కియా కార్ల పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి హెచ్చరించారు. సోమవారం ట్విటర్ వేదికగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కియా కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుందని, అక్కడ అంతా తమిళులే, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని ఏడుపు లంకించుకున్నాయన్నారు. దొంగ ఏడుపులు వద్దని, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ …
Read More »ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2019 ఫలితాలను విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ కార్యదర్శి విజయరాజు సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తెలుగు రాష్ట్రల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది రాయగా.. 1,35,160 (74.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరకాగా 68, …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఏపీలో 70 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు బదిలీ
ఏపీ ప్రభుత్వం మారడంతో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నవారిని తప్పించారు. తాజాగా మరి కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భారీగా బదిలీ కానున్నారు . జూనియర్ మొదలు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌ల వరకు దాదాపు 70 మందికిపైగా అధికారులను ప్రభుత్వం బదిలీ చేయనుంది. మరో నాలుగైదు రోజుల్లోనే …
Read More »రవిప్రకాశ్‌కు అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక అరెస్ట్ ఒక్కటే
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు అన్ని దారులు మూసుకుపోయాయి. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రవిప్రకాశ్ పునారాచనలో పడ్డారు. పోలీసులకు చిక్కకుండా కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ మాజీ సీఈవో ప్రస్తుతం లొంగిపోయే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో రాజకీయంగానూ పలువురు నేతలు రవిప్రకాశ్‌కు ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రెండు వారాల ముందే ఏపీని వీడినట్లు సమాచారం. …
Read More »