పాకిస్థాన్ – అఫ్గానిస్థాన్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ గుల్బాడిన్ నైబ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన అఫ్గాన్ ఈ మ్యాచ్‌లో అయినా గెలవాలని చూస్తోంది. మరోవైపు నాకౌట్ చేరేందుకు పాకిస్థాన్ ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ పోరు రసవత్తరం కానుంది. అఫ్గానిస్థాన్ జట్టు: గుల్బాడిన్ నైబ్(కెప్టెన్), రహ్మత్‌షా, హష్మతుల్లా షాహిది, అస్గర్ అఫ్గాన్, …
Read More »వైఎస్ జగన్ ను అభినందిస్తున్న..ట్విటర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని
విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విటర్ వేదికగా మరోసారి స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ చూపుతున్న చొరవను అభినందిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. జల వివాదాలు, గోదావరి జలాల సమర్థ వినియోగం, విభజన సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదికగా శుక్రవారం రెండు రాష్ట్రాల సీఎంల మధ్య కీలక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ …
Read More »జూలై 1 నుంచి వైఎస్ జగన్ ప్రజాదర్బార్
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూలై 1వ తేదీ నుంచి తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ జగన్ స్వయంగా ప్రజలను కలుసుకునేందుకు వీలుగా జూలై 1 నుంచి ప్రజాదర్బార్‌ను తలపెట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించేవారు. ఆయన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొంతవరకూ అదే బాటను …
Read More »బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనుగుంట్ల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ వరదాపురం సూరి శుక్రవారం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆ పార్టీ సీనియర్ నేత రాంమాధవ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో ధర్మవరం నుంచి గెలిచిన సూరి ఇటీవల …
Read More »అనంతపురంలో ఆర్ట్స్ కళాశాలలో అమ్మాయి కోసం గ్యాంగ్ వార్..వీడియో చూస్తే షాకే
20 మందికి పైగా విద్యార్థులు ఓ యువకుడిని చితకబాదారు. రౌడీల్లా అరాచకం సృష్టించారు. అచేతన స్థితికి చేరుకున్నా ఏమాత్రం కనికరం లేకుండా బెల్టులు, బండరాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో మూడ్రోజుల క్రితం చోటు చేసుకుంది. ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాల్లో వైరల్ కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం మండలం చిగిచెర్లకు చెందిన రాజేష్ అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో …
Read More »బిగ్‌బాస్ 3 షోకు 14 మంది లిస్ట్ రెడి..స్టార్ మా అధికారిక ప్రకటన
తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రారంభం కాబోతున్నది. గత రెండు సీజన్లలో విశేష ఆదరణ పొందిన ఈ షో మూడో సీజన్‌కు సర్వం సిద్ధమవుతున్నది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ కన్ ఫ్యూజన్ తొలగిపోయింది. టాలీవుడ్ హీరో నాగార్జున ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అఫిషియల్ ప్రోమో కూడా బయటకు వచ్చింది. గుడ్లు, కూరగాయలు, రైస్ ఇలా మార్కెట్ …
Read More »పుల్లెల గోపీచంద్‌కు డాక్టరేట్ ప్రదానం
భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఐఐటీ కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. శుక్రవారం విద్యా సంస్థ 52వ స్నాతకోత్సవంలో… గోపీకి ఇస్రో పూర్వ చైర్మన్, ఐఐటీ కాన్పూర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ అయిన ప్రొఫెసర్ కె.రాధాకృష్ణన్ రజత ఫలకం అందివ్వగా, ఐఐటీ డైరెక్టర్ ప్రొ. అభయ్ కరన్‌దికర్ డాక్టరేట్ ధ్రువపత్రాన్ని ప్రదానం చేశారు.
Read More »టీడీపీని వీడకుండ ఉండేందుకు 10 కోట్లు ఆఫర్..అయిన పార్టీ మారుతున్న 16 మంది
గడిచిన ఎన్నికల్లో ఘోర పరాజయం అయిన టీడీపీ పార్టీ తన చరిత్రలోని అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఓవైపు తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా…ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ.. అదే దుస్థితి ఎదురయ్యేలా ఉంది. ఏపీలో టీడీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో… ఏకంగా 16 మంది టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే కాని జరిగితే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. అయితే …
Read More »ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కుమార్తెకు షాకిచ్చిన జగన్
ఎలాంటి అనుమతులు లేకుండా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నిర్మించిన రెండు అంతస్తుల ప్రింటింగ్ కార్యాలయాన్ని నిర్మించిన ‘ఆంధ్రజ్యోతి’ సంస్థకు గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) అధికారులు నోటీసులు జారీ చేశారు. భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో స్పష్టం చేశారు. నోటీసు అందిన ఏడు రోజుల్లోగా స్పందించాలంటూ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె అనూషకు ప్రొవిజినల్ …
Read More »ఘోర ప్రమాదం.. 16 మంది మృతి..సంఖ్య పెరిగే అవకాశం
మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున గోడ కూలిన ఘటనలో దాదాపు 16 మంది మృతి చెందారు. నగరంలోని కొంద్వా ప్రాంతంలోని తలాబ్ మసీదు వద్ద 60 అడుగుల ఎత్తున్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మృతుల్లో 9 మంది పురుషులు, నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య …
Read More »