పక్క రాష్ట్రాలతో తమ ప్రభుత్వం సన్నిహితంగా మెలుగుతోందనే బాధ టీడీపీ నేతల్లో స్పష్టంగా కనబడుతోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడిన దాంట్లో సబ్జక్ట్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. అందరికీ తెలిసిన విషయాలనే అచ్చెన్నాయుడు పదేపదే ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి …
Read More »ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు అరెస్ట్ వారెంట్..!
ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ రాధాకృష్ణకు జగ్గయ్యపేట కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. అసత్య వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ.. జగ్గయ్యపేటకి చెందిన ముత్యాల సైదేశ్వరరావు.. పత్రిక ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్‌లపై గతంలో పరువునష్టం దావా వేశారు. అయితే కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి పలుమార్లు నోటీసులు జారీచేసినా వారు హాజరుకాలేదు. దీంతో రాధాకృష్ణ, శ్రీనివాస్‌ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. బుధవారం వారిద్దరికి …
Read More »ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..ఏ జిల్లాలో తెలుసా
ఆంధ్రప్రదేశ్ లో 2019వ సంవత్సర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విశాఖలో జరిగే అవకాశాలున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆరా …
Read More »మరో నాలుగైదు రోజుల్లో జగన్ టీంలోకి డైనమిక్ అధికారి..రోహిణీ సింధూరీ
రోహిణీ సింధూరి. ఓ మహిళా ఐఏయస్ అధికారి. కొద్ది కాలం క్రితం ఈ పేరు ఓ సంచలనం. కర్నాటకలో అధికారంలో ఉన్న మంత్రులకే చెమటలు పట్టించారు. ప్రభుత్వ మీదే న్యాయ పోరాటం చేసారు. చట్టానికి చుట్టాలుండరని నమ్మ టమే కాదు..ఆచరణలో చూపించిన అధికారి. అటువంటి అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు కర్నాటకతో సంప్రదింపులు జరిపారు. వాళ్లు అంగీకరించారు. మరో నాలుగైదు రోజుల్లో …
Read More »ఏపీలో ఒకే విడతలో 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాలు..!
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే విడత 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ఫైలు గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. వైఎస్ జగన్‌ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకుండానే ఒక చరిత్రను సృష్టించబోతోంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర …
Read More »తిరుమలలో ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలు రద్దు..!
సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే లక్ష్యంతో ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచీ తిరుమలలో చోటు చేసుకొన్న అక్రమాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్రేక్ దర్శనాల్లో అమలు చేస్తున్న ఎల్-1, 2, 3 విధానంలో లోపాలను ఆసరా చేసుకొని పలు అక్రమాలకు పాల్పడ్డారని ఛైర్మన్ తెలిపారు. వ్యవస్థలో ఉన్న లోపాలను …
Read More »టీటీడీకీ కోటి విరాళం ఇచ్చిన డల్లాస్ ఎన్నారై…దరువు ఎండీ కరణ్ రెడ్డితో కలిసి చెక్ అందజేత..!
తిరుమల తిరుపతి దేవాలయానికి డల్లాస్ ఎన్నారై జాస్తి సాంబశివ రావు ఒక కోటి విరాళం ఇచ్చారు. ఈ రోజు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సతీసమేతంగా కలిసి కోటి రూపాయలకు సంబంధించిన చెక్ అందజేశారు. ఈ ఒక్క ఏడాది మాత్రమే కాదు ఈ ఐదేళ్లకు కోటి చెప్పున మొత్తం రూ. 5 కోట్లు ఇస్తానని ఈ సందర్భంగా శివ వైవీ సుబ్బారెడ్డికి తెలిపారు. ఇలా భక్తులు టీటీడీకి దానం చేయడం …
Read More »దేవుడు వైఎస్ జగనన్న..జనసేన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేసిందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండగలా చేశారని గుర్తుచేశారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారం ఇవ్వడం గొప్ప విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమ బతుకులు …
Read More »ప్రధాని మోదీ కీలక నిర్ణయం. వైఎస్ జగన్‌కు భారీ గిఫ్ట్ …టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు
ఏపీ ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారానికి ముందే తన వద్దకు వచ్చిన వైసీపీ అధినేత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన తొలి విజప్తి పైన ముఖ్య అడుగు వేస్తునట్లు తెలుస్తుంది. .ప్రధాని తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రికి భారీ ఉపశమనం కలిగిస్తోంది. ఏపి విభజన సమయంలో రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఆ తరువా త దీని పైన …
Read More »ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ విశ్వభూషణ్ గురించి మీకు తెలియని విషయాలు
కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించింది. విశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీచేసింది. చత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్ గా అనసూయా ఉయికేను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫైల్ పై సంతకం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు డిసెంబర్ 2009లో గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ నియమితులయ్యారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు …
Read More »