ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే. చూస్తే విజయసాయి రెడ్డి అన్నా మాటు నిజమై లాగా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా మాజీ స్పీకర్ కోడెల వరప్రసాదరావు కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మిపై సోమవారం మరో కేసు నమోదైంది. తమ నుంచి …
Read More »వైఎస్ జగన్ పై దేవినేని ఉమా ఫైర్
చంద్రబాబు ఇంటిని, అమరావతిని ముంచాలని ప్రభుత్వం చేసిన కుట్రకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ నేత దేవివేని ఉమా మహేశ్వరరావు అన్నారు. వరదల కారణంగా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదం వల్లే నేడు రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు కొందరు ప్రభుత్వంపై నోరు …
Read More »నగరంలో విజృంభిస్తున్న డెంగీ, మలేరియా….జాగ్రత్తలు ఇవే
నగరానికి జ్వరం పట్టుకుంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాదులు విజృంభిస్తున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు ఆస్పత్రులన్నీ జ్వర పీడితులో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన హాస్పిటల్స్‌లో సిబ్బంది, ఇతర సదుపాయాల కొరత ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రుల వైపు పరుగులు పెడుతున్నారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. సీజనల్ వ్యాధులపై కేంద్ర వైద్య శాఖ రాష్ట్ర వైద్యాధికారులను అప్రమత్తం చేసింది. అందుకనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పలు చర్యలు …
Read More »ఇన్ని రోజుల్లో నిన్ను ప్రేమించకుండా ఉండని క్షణం లేదు..బ్రాహ్మణిని ఉద్దేశించి లోకేష్ ట్వీట్
టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ , ఆయన భార్య బ్రాహ్మణి లు పన్నెండో పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ లో చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. బ్రాహ్మణికి ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.పన్నెండేళ్లుగా ప్రతీ సెకను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానని నారా బ్రాహ్మణిని ఉద్దేశించి లోకేష్ ట్వీట్ చేశారు.‘12ఏళ్లు.. 144 నెలలు.. 4,383రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు.. ఇన్ని రోజుల్లో నిన్ను …
Read More »నారా లోకేష్ ను దారుణంగా విమర్శిస్తూ..జగన్ని పోగుడుతూ…టీజీ వెంకటేష్ సంచలన వాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో తిరుగులేని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి మంచి పరిపాలన అందిస్తున్నారని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కొనియాడారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాజధాని ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి జరిగి ఉంటే మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయే వారు కాదని దారుణంగా విమర్శించారు. రాజధాని ప్రాంతం …
Read More »జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకీ అవసరం లేదు…ఆగ్రహంలో ఫ్యాన్స్…!
జూనియర్ ఎన్టీఆర్‌పై బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని భర్త శ్రీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదన్న భరత్…ఒక వేళ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలంటే..అధినేత చంద్రబాబుతో చర్చించి రావాలంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం భరత్ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయాన్ని ఎదుర్కోంది. …
Read More »ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్
నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఉదయం 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి దేశ రాజధానికి చేరుకున్నారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరగనున్న సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరుతారు. మధ్యాహ్నం …
Read More »జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ ..టూలెట్ బోర్డులు
గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అయింది. పార్టీ లోగోలు, పార్టీ అధినేత చిత్రాలను తొలగించకుండానే యజమానికి కార్యాలయ భవనాన్ని తిరిగి అప్పగించారు. భవన యజమాని టూలెట్ బోర్డు ఏర్పాటు చేశాడు. బార్ అండ్ రెస్టారెంట్‌కు అద్దెకు ఇస్తానని అందులో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో ఈ కార్యాలయాన్ని జనసేన పార్టీ నేతలు ప్రారంభించిన విషయం తెలిసిందే. …
Read More »చరిత్ర సృష్టించిన తెలుగుతేజం పీవీ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతగా తెలుగుతేజం పీవీ సింధూ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరగిన ఫైనల్‌లో ప్రపంచ నెంబర్ ఫోర్ నొజోమి ఒకుహార (జపాన్)పై వరుస సెట్లలో విజయంతో ప్రపంచ మహిళా సింగిల్స్ ఛాంపియన్‌గా పీవీ సింధూ నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఒకుహరను మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తాను సాధించిన చారిత్రక విజయాన్ని తన తల్లి పీ విజయ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు అంకితం …
Read More »సచిన్ -గంగూలీల రికార్డు బ్రేక్..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి- వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలు అరుదైన ఘనతను నమోదు చేశారు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన జోడిగా కోహ్లి-రహానేలు నిలిచారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి-రహానేల జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ తలో హాఫ్ సెంచరీ సాధించి అజేయంగా 104 పరుగుల్ని …
Read More »