పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా డోకిపర్రు వద్ద మొక్కను నాటి సీఎం వనమహోత్సవానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతగానో దోహద పడతాయని.. దీనిని దృష్టిలో పెట్టుకుని విరివిగా మొక్కలు నాటేలా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని డోకిపర్రు అడ్డరోడ్డు వద్ద శనివారం జరిగే …
Read More »అక్టోబరు 2 నుంచి అన్ని గ్రామ సచివాలయాల భవన నమూనా ఇదే
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామ సచివాలయాలు ఇక వైసీపీ రంగుల్లోకి మారిపోనున్నాయి . అక్టోబరు 2 నుంచి అమలులోకి వచ్చే గ్రామ సచివాలయాల భవన నమూనాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లాలకు పంపింది. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న పంచాయతీ భవనాలను ఇదే విధంగా మార్పులు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేసే చోట ఇదే విధానాన్ని అమలు చేయాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కలెక్టర్లకు సూచించారు.
Read More »ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఇసుక రవాణా టెండర్లు రద్దు
కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక తరలింపుకు కి.మీకి అతి తక్కువ ధర కోట్ చేయడంతో టెండర్లను రద్దు చేసింది. జిల్లా మొత్తం ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయని టెండర్లు రద్దును ఆమోదించింది ప్రభుత్వం. కి.మీ ఇసుకకు 4 రూపాయల 90 పైసలను ఖరారు చేసింది ఏపీ సర్కార్. జీపీఎస్ ట్రక్కుల ఉన్న యజమానులు దరఖాస్తు …
Read More »బిగ్‌బాస్ 3లోకి రమ్యకృష్ణ..ఏరేంజ్‌లో ఉంటుందో
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. తాజాగా ఈ బిగ్‌బాస్ లో ఆరో వారంలో అలనాటి నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనుంది. బిగ్‌బాస్ రాజ్యాన్ని చక్కదిద్దేందుకు శివగామి అధికారాన్ని చేపట్టింది. ఈ వీకెండ్‌లో హోస్ట్‌గా వచ్చి.. ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు రమ్యకృష్ణ రెడీ …
Read More »కర్నూల్ జిల్లాలో మంత్రి బుగ్గన 70వ వన మహోత్సవ కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అడవుల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 70వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో విద్యార్థులతో కలిసి సీఎం జగన్ మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని …
Read More »ఏపీ సర్కారుకు చంద్రబాబు హెచ్చరిక..వైసీపీ సోషల్ మీడియా భారీ కౌంటర్ ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత నెలకొందంటూ టీడీపీ దర్నాలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. దేన్నయినా సహిస్తాం కానీ, పేదల జోలికి వస్తే మాత్రం ఖబడ్దార్ అంటూ ఏపీ సర్కారును హెచ్చరించారు. పేదలకు అన్యాయం జరుగుతుంటే టీడీపీ చూస్తూ ఊరుకోదని ట్వీట్ చేశారు. ఇసుక కొరత కారణంగా లక్షల మంది పేదవాళ్ల ఉపాధి మార్గాలను కూల్చివేశారని, ఆఖరికి …
Read More »టీడీపీ మాజీ మంత్రి జైలుకే..మరి ఇంత దారుణమా
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా 6సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన సోమిరెడ్డి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లోనూ కాకాణి చేతిలో మరో సారి సోమిరెడ్డి ఓడారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా, తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న ఆ …
Read More »ఏపీలో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా కోసం వాటర్ గ్రిడ్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా, వాటర్ గ్రిడ్ పథకంపై ముఖ్యమంత్రి శుక్రవారం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్ధానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపజేయాలని సీఎం …
Read More »టీడీపీ మహిళా నేత అక్రమ దందా..!
అనంతపురం జిల్లాలో టీడీపీ మహిళా నేత అక్రమ దందా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైనింగ్ అధికారులు సీజ్ చేసిన క్వారీ నుంచి కంకరను టిప్పర్‌తో అక్రమంగా తరలిస్తుండగా కియా పోలీసుస్టేషన్ సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలో టీడీపీ నాయకురాలు సవితమ్మ నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌ఆర్ ట్రస్టుకు చెందిన క్వారీకి సరైన అనుమతులు లేకపోవడంతో ఇటీవల జిల్లా మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. క్వారీలోని కంకరను బయటకు …
Read More »కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..20 మంది మృతి..70 మంది మంటల్లో
మహారాష్ట్రలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ధూలే జిల్లా సిర్‌పూర్ గ్రామంలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. సిలిండర్ పేలుడుతో మంటలు ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన ఘటనలో సుమారుగా 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 22 మంది తీవ్ర గాయాలపాలు కాగా 70 మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడున్న వారంతా హాహాకారాలు చేస్తూ బయటికి పరుగులు తీశారు. కాగా …
Read More »