ఆటో కార్మికులను మోసం చేసిన జనసేన పార్టీ కార్యకర్తపై తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పోలీసు స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. జగ్గంపేట మండలం మామిడాడకు చెందిన శరకణం గణేష్ అనే జనసేన పార్టీ కార్యకర్త కొద్ది రోజుల క్రితం యర్రవరంలో మాధవీలత ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఆటోలు కొనుగోలుకు లక్ష రూపాయలు కడితే అంతే మొత్తంలో జనసేన పార్టీ ఎన్ఆర్ఐ కార్యకర్తల నుండి ఉచిత సబ్సిడీ వస్తుందని డ్రైవర్లను నమ్మించాడు. …
Read More »ఎంపీ వాహనంపై దాడి
పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌పై దాడి ఘటన మరువకముందే మరో బెంగాల్ నేతపై తృణమూల్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. బరక్‌పూర్ ఎంపీ అర్జున్ సింగ్ ప్రయాణిస్తున్న వాహనంపై ఆదివారం మధ్యాహ్నం కొందరు తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా శ్యామ్‌నగర్‌లోని ఫీడర్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తగా పోలీసులు జరిపిన …
Read More »జగన్ సర్కార్ పై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా కామెంట్స్
టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ యైభుత్వ తీరుపై విమర్శలు చేశాడు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలన 100 తప్పటడుగులు, 100 తడబాట్లుగా సాగుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడుపై కక్షతో మద్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విమర్శించారు. ఇసుక టెండర్లను వైసీపీ వాళ్లకు ఇవ్వడం సిగ్గుచేటని పేర్కొన్న డొక్కా, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు …
Read More »ఏపీలో చౌక ధరకే ఇసుక..టన్ను ఏంతో తెలుసా
ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం కొత్తగా తీసుకువస్తున్న ఇసుక విదానంలో చౌకగా ఇసుక దొరికే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో టన్నుకు 126=50 ఉండగా, ఏపీలో దానిని 375 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. అది కూడా రవాణా వ్యయంతో కలిపి నిర్ణయించారు.దీనివల్ల వినియోగదారులపై గతంలో తక్కువ దరకు ఇసుక దొరికే పరిస్తితి వచ్చింది.ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి, ఇసుక సరఫరా ధరను అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని …
Read More »సీఎం వైఎస్ జగన్ కు చంద్రబాబు నాయుడు లేఖ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణానది వరదల విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన ఆరోపించారు. సహాయ చర్యలలో నిర్లక్ష్యం కనిపించిందని ఆయన చెప్పారు. ప్రకాశం బారేజీ వద్ద నీటిని సకాలంలో తగ్గించలేదని, ఒకేసారి రెండున్నర లక్షల క్యూసెక్యుల నీరు వదలడంతో లంక గ్రామాలు ముంపునకు గురి అయ్యాయని ఆయన అన్నారు.తన ఇంటికి నోటీసులు ఇవ్వడం, డ్రోన్ లు వేయడంలో …
Read More »ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలి.. సీఎం జగన్
వినాయక చవితి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలన్నారు. ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.
Read More »రేపు సీఎం జగన్ ఇడుపులపాయకు..!
సెప్టెంబరు 2వ తేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనకు వస్తున్నారని, పర్యటన విజయవంతానికి పటిష్ఠవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ హరి కిరణ్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 2వ తేది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇడుపులపాయ, పులివెందులలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందన్నారు. సెప్టెంబరు 2వ తేది ఉదయం ప్రత్యేక విమానంలో సీఎం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయకు వెళతారన్నారు. వైఎస్సార్ ఘాట్ …
Read More »చింతమనేని కోసం.. ప్రత్యేక బృందాలు గాలింపై..ఎస్పీ ..డీఎస్పీ సీరియస్
దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యాన్ని నెలకొల్పి పదేళ్లుగా అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన చింతమనేని ప్రభాకర్ పరారీ కావడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దళిత యువతపై దాడికి యత్నించిన సంఘటనలో ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు కావడంతో శుక్రవారం పోలీసుల కళ్లు కప్పి ఉడాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. ఐదుగురు సీఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించి గాలిస్తున్నారు. శనివారం చింతమనేని ఇంటికి వెళ్లిన …
Read More »వైసీపీలో చేరిన విశాఖ డైరీ చైర్మన్ కొడుకు..టీడీపీ కీలక నాయకులు
విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ కీలక నాయకులు వైసీపీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆదివారం వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అడారి ఆనంద్ పరాజయం పాలయ్యారు. …
Read More »ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే సుమారు15 లక్షల మందికి పైగా పరీక్షలకు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు. ఇక 3వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరిగే పరీక్షలను 6,19,812 మంది రాయనున్నారని తెలిపారు. …
Read More »