జోగులాంబ జిల్లా గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భీముడి మృతి చెందడం పట్ల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు గట్టు మండలం బల్గెరా గ్రామం కు చేరుకొని భీముడు అంత్యక్రియల్లో కేటీఆర్ పాల్గొంటారు.
Read More »చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు..మంత్రి ఎర్రబెల్లి
చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తెస్తున్నామని, పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యానించారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా ఉమ్మడి జెడ్పీ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని మాట్లాడారు. రానున్న కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా మళ్లీ స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయిస్తామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిథులకు అధికారాలు ఇస్తే అభివృద్ధి జరుగుతుందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని …
Read More »రేవంత్‌తో వివేక్ భేటీ…కాంగ్రెస్‌లోకి వెళ్తారా?
తెలుగు రాజకీయాల్లో మరో కీలక పరిణామం. ఇటీవలి కాలంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతున్న ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ నేత జి.వివేక్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో వివేక్‌కు చెందిన మీడియా కార్యాలయంలో రేవంత్ రెడ్డి, వివేక్ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల మధ్య దాదాపు …
Read More ».వైఎస్‌తో ఆగిపోయింది మళ్లీ ఎందుకు మొదటుపెట్టారంటే…?
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రతి రోజు ఉదయం కొంతసేపు సామాన్యులను కలుసుకుని వారి సమస్యలు విని…వాటికి పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించే సంప్రదాయాన్ని తిరిగి మొదలుపెట్టనున్నారు. వచ్చే నెల నుంచి ఆయన మొదలుపెట్టనున్నారు. సామాన్యులు తనను కలుసుకునేందుకు అవకాశం కల్పించిన సీఎంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ నిలిచారు. అయితే ఆ తరువాత ముఖ్యమంత్రులుగా …
Read More »జగన్, దేవేంద్ర ఫడ్నవీస్ లకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఎందుకంటే..?
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ యించిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎం కోరారు. ఈ మధ్యాహ్నం సీఎం కేసీఆర్.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ఫడ్ణవీస్ అంగీకరించారు. …
Read More »వైసీపీకి బీజేపీ ఆఫర్… సీఎం జగన్ తో జీవీఎల్ భేటీ
లోక్ సభలో నాల్గో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. లోక్‌సభలో మూడో అతిపెద్ద పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, 23 మంది ఎంపీలతో డీఎంకే మూడో అతిపెద్ద పార్టీగా ఉండగా 22 మంది ఎంపీలతో వైసీపీ నాల్గో స్థానంలో ఉంది. డీఎంకే యూపీఏ పక్షంలో ఉండటంతో డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఇవ్వాలని బీజేపీ …
Read More »జిల్లా పరిషత్ లకు ప్రత్యేక నిధులు..సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!!
పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధికి పంచాయతీ రాజ్ ఉద్యమం, సహకారం ఉద్యమం ఎంతగానో దోహదపడ్డాయని, ఆ ఉద్యమానికి పూర్వ వైభవం రావాలని చెప్పారు. నిర్ధేశిత లక్ష్యాలను ఛేదించి, గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్ …
Read More »ఈనెల 14న యాదాద్రి భవన్ సమాచార కేంద్రాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నగరంలోని బర్కత్ పురాలో నిర్మించిన యాదాద్రి భవన్ సమాచార కేంద్రాన్ని ఈనెల 14న ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. ఈ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మేల్యే గొంగిడి సునీతలు మంగళవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రిని కలిసి అందజేశారు.
Read More »రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు
ఖరీఫ్ సాగు మొదలయిన నేపథ్యంలో రైతులకు పంట పెట్టుబడులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన వారి ఖాతాలలో డబ్బులు జమ చేయాలని, ఎన్నికల కోడ్ మూలంగా జరిగిన జాప్యంతో రైతులు నష్టపోకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుండి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే నాలుగు విడతలుగా రైతుల ఖాతాలలోకి ఆర్బీఐ …
Read More »119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని సీఎం కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో వీటిని ఈనెల 17న సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉండేవి. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మరో 142 కొత్త బీసీ …
Read More »