ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహామ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరికీ తెలంగాణలో కరోనా సోకలేదని.. విదేశాల నుంచి వచ్చేవారికే కరోనా ఉన్నట్టు తేలిందని చెప్పారు. కరోనా విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరంలేదన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పాటు… చెస్ట్, ఫీవర్ …
Read More »మే నెల నాటికి సస్పెన్షన్ బ్రిడ్జి పూర్తి కావాలి.. మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో పలు పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెం.45లో నిర్మిస్తున్న ఫ్లైవర్ పనులను పరిశీలించారు. అలాగే దుర్గం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. మే నెల నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ‘తీగల వంతెన నిర్మాణం పూర్తైన తర్వాత సుందరీకరణ పనులు ప్రారంభించాలి. పనులు వేగవంతం …
Read More »యాసంగి ధాన్యం కొనుగోళ్లకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు
వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే యాసంగి (రబీ) సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. 2019-20 యాసంగి కార్యాచరణపై సోమవారం నాడు హాకా భవన్లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల్ రాజేందర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, …
Read More »మిషన్ భగీరథతో ఫ్లోరైడ్‌కు చెక్.. మంత్రి కేటీఆర్
మిషన్ భగీరథ పథకంతో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌కు చెక్ పెట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేసిన కేటీఆర్ ఎంతో ముందుచూపు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో అత్యంత సురక్షితమైన మంచినీటిని ప్రజలకు అందిస్తున్నారని చెప్పారు. మిషన్ భగీరథ టీంకు,ఇంజనీరింగ్ అధికారులకు ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు. నల్గొండ జిల్లాలో గత ఆరేళ్లుగా ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా …
Read More »అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు షెడ్యూల్ విడుదల!!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 6వతేదీన ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై తొలిసారి ప్రసంగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Read More »ప్లాస్టిక్ ను వదిలేద్దాం.. భూతల్లిని కాపాడుకుందాం
పర్యావరణానికి అతి పెద్ద ప్రమాదకారి ప్లాస్టిక్ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ ను వదిలేసి భూతల్లిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం పట్టణ ప్రగతిలో బాగంగా సూర్యపేట పట్టణంలోని బ్రాహ్మణ కళ్యాణమండపం లో సుధాకర్ పి విసి మరియు ఐ సి ఐ సి ఐ బ్యాంక్ ల ఆధ్వర్యంలో చేపట్టిన ఏడూ …
Read More »వృద్ధ వికలాంగుడిపై మానవత్వం చూపిన సీఎం కేసీఆర్
వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. గురువారం మద్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వికలాంగుడైన వృద్ధుడి చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కేసీఆర్ కారు దిగి ఆగారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తనకు తానుగా మహ్మద్ సలీమ్ గా పరిచయడం చేసుకున్న అతడు, గతంలో డ్రైవర్ …
Read More »అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత
అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ శివారులో సారంగాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును ఆర్ అండ్ బీ, గృహ నిర్మాణ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ… ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని …
Read More »భువనగిరి పట్టణ పురపాలక పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ పాలకవర్గం సమావేశానికి హాజరయ్యారు. భువనగిరిలో పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్న తీరుపైన అధికారులను పాలకవర్గ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న నాలుగు సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేనందున పార్టీలకతీతంగా అందరూ కలిసి సమన్వయంతో పట్టణ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని మంత్రి కోరారు. భువనగిరి పట్టణ సమగ్రాభివృద్ధికి …
Read More »సీఎం కేసీఆర్‌తో ట్రంప్ కరచాలనం
రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన ప్రత్యేక విందు కార్యక్రమం ప్రారంభమైంది. తొలిసారి రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కాసేపు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా విందుకు హాజరైన కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను ట్రంప్ పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరచాలనం చేశారు. …
Read More »