కోవిడ్ 19 కరోనా వైరస్ ను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజా రక్షణకు సైబరాబాద్ పోలీసులు 24 X 7 నిర్విరామంగా, అలుపెరుగని సైనికులలా పని చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నివసిస్తున్న పేదలకు, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గారి సూచనల మేరకు స్వచ్ఛంద సంస్థలు, సొసైటీ …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ మొత్తంలో విరాళాలు..!
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఉపయోగపడేందుకు వీలుగా పలు సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి . దీనికి సంబంధించిన చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. – హెటిరో డ్రగ్స్ రూ.5 కోట్ల విరాళం అందించారు. దీంతో పాటు రూ. 5 కోట్ల విలువైన మందులను (హైడ్రాక్సి క్లోనోక్విన్, రిటోనవిర్, …
Read More »ఆటోవాలాలకు మంత్రి హరీష్ అండ..!
కరోనా ప్రభావంతో దినం గడిస్తేనే తినడానికి సరుకులు తెచ్చుకునే సిద్ధిపేట ఆటో కార్మికులకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. గత 15 రోజులుగా కరోనా వ్యాధి వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో దినం కష్టపడితేనే పూట గడవని ఆటోవాలాలను ఆదుకునేందుకు మంత్రి హరీశ్ ముందుకొచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఎక్స్ ప్రెస్ బస్ స్టాoడ్ ఆవరణలో 700 మంది ఆటో కార్మికులకు మంత్రి …
Read More »రైస్ మిల్లర్లకు అండగా ప్రభుత్వం..సీఎం కేసీఆర్ హామీ
తెలంగాణ రాష్ట్రంలో వరి పంట దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం మరియు బియ్యం విధానం’ రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైస్ మిల్లర్లతో పాటు ఇతర భాగస్వాములందరితో చర్చలు జరిపి, విధానాన్ని రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం అండగా ఉండి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేయనున్నట్లు ప్రకటించారు. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చిస్తామని, అసెంబ్లీలో కూడా చర్చించి, …
Read More »వలస భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపైన మంత్రి కేటీఆర్ సమావేశం
కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఏర్పడిన పరిస్థితుల్లో నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం పైన భవన నిర్మాణదారుల అసోసియేషన్లతో (బిల్డర్ అసోషియేషన్లు) ప్రగతి భవన్ లో పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ రోజు సమావేశం నిర్వహించారు. దేశంలో వివిధ ప్రాంతాలలో నుండి హైదరాబాద్ మహా నగరానికి వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా దాదాపు వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, లాక్ …
Read More »పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా గాంధీ ఆసుపత్రి…
కరోనా వైరస్ వ్యాప్తి ని నిరోధించడంలో మన ప్రభుత్వం సమర్దవంతంగా పని చేస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరోసారి కితాబిచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. విదేశాల నుండి వచ్చే వారిని స్క్రీన్ చేయడం, హోమ్ క్వారంటైన్ ఉన్నవారికి పరీక్షలు చేయడం లాంటి కార్యక్రమాలు, రాష్ట్రం షట్ డౌన్ చేయాలని సిఎం కేసీయార్ తీసుకున్న నిర్ణయాలతో కరోనా వ్యాప్తి ని అరికడుతున్నామని …
Read More »ఫార్మ మరియు బల్క్ డ్రగ్ కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశం
కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల నేపథ్యంలో మంత్రి కే. తారకరామారావు ఈరోజు ప్రగతి భవన్ లో రాష్ట్రంలోని ఫార్మా మరియు బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ ఫార్మా ఇండస్ట్రీని ప్రభుత్వం అత్యవసర సేవారంగంగా గుర్తించిందని మంత్రి వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడి కోసం అవసరమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు ఉన్న …
Read More »కరోనా వైరస్.. తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కరోనా వైరస్ విషయంలో నిన్న కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లు, …
Read More »కరోనా వైరస్.. గిరిజన ప్రాంతాల్లో పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలి
గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి కరోనా వైరస్ రాకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని, కోవిడ్- 19 వైరస్ పట్ల, ఈ వ్యాధి లక్షణాల పట్ల అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల విద్యాలయాల అధికారులు, ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, పదో తరగతి, …
Read More »హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో GHMC చేపట్టిన పనుల ప్రగతిని సమీక్షించిన మంత్రి KTR
హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసన సభ స్థానాల్లో జిహెచ్‌ఎంసి చే చేపట్టిన చేసిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు స్పష్టం చేశారు. బుధవారం జిహెచ్‌ఎంసి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్.ఆర్.డి.పి కింద మంజూరు చేసిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ల విస్తరణ పనులు, మెట్రో లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, …
Read More »