పర్యావరణాన్ని పరిరక్షించడం వ్యవసాయం ద్వారానే సాధ్యం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి నిరంజన్ రెడ్డి జగిత్యాల జిల్లా పొలాసలో వ్యవసాయ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ భూమండలాన్ని పచ్చగా ఉంచే శక్తి వ్యవసాయానికే ఉంది. ఇతర కార్యాకలాపాలన్నీ పర్యావరణాన్ని నాశనం చేసేవే అన్నారు. ఒకప్పుడు ఎంత పొలం ఉంది అని అడిగి పిల్లనిచ్చేది. కానీ …
Read More »దేశానికి తెలంగాణ రోల్ మోడల్..!!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యం అని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని కంది మండలంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో రామకృష్ణా రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. రామకృష్ణా రెడ్డి మంచి నాయకుడు అని ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో కంది మండలం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రూ.80 కోట్లతో కంది-శంకర్ పల్లి రోడ్డు …
Read More »జనవరి 15వ తేదీలోపు బంజారా, గిరిజన భావనాలు..మంత్రి సత్యవతి
ఆత్మగౌరవ భవనాల నిర్మాణంతో ఆయా కులాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బంజారాహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న బంజారాభవన్, కొమరంభీం భవన్‌ల నిర్మాణ ప్రగతిని మంత్రి సత్యవతి బుధవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో 40కోట్లరూపాయల వ్యయంతో ఈ రెండు భవనాలను అతి త్వరలో పూర్తిచేసేందుకు క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు మంత్రి సత్యవతి సూచనలు చేశారు. జనవరి 15వ …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టుపై గవర్నర్ ప్రశంసలు..!!
రైతులకు సాగునీరందించేందుకు ప్రభుత్వం నిర్మించిన అద్బుతమైన సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరమని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ధర్మారం మండలంలో ప్యాకేజి 6 కింద నిర్మించిన నంది పంప్ హౌజ్ ను గవర్నర్ దంపతులు బుధవారం పరిశిలించారు. నంది పంప్ హౌజ్ లో భాగంగా నిర్మించిన సర్జపూల్, పంప్ హౌజ్ పనులను, విద్యుత్ సబ్ స్టేషన్ పనులను గవర్నర్ పరిశీలించారు. నంది …
Read More »ఆదర్శంగా కాసులపల్లి గ్రామం..!!
స్వచ్చత అంశంలో కాసులపల్లి గ్రామం దేశానికి ఆదర్శంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. బుధవారం గవర్నర్ బసంత్ నగర్ లో స్వశక్తి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన బట్ట సంచుల తయారీ యూనిట్ ను, శాంతినగర్ లో ఏర్పాటు చేసిన శానిటరీ న్యాపకిన్ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో పర్యటించిన గవర్నర్ గ్రామంలో అమలవుతున్న స్వచ్చ కార్యక్రమాలను పరిశీలించారు. …
Read More »దేశంలో అగ్రస్థానంలో నిలవనున్న టెక్స్ట్ టైల్ పార్క్
దేశ చరిత్రలో అగ్రభాగాన కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్కు దేశంలోనే అగ్రభాగాన నిలవబోతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పిచైర్మన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ హరిత… కొరియా నుండి వచ్చిన యంగ్ వన్ కంపెనీ చైర్మన్ కీయాన్ సూవ్ మరియు బృందంతో కలిసి పార్కును సందర్శించారు. ఈ కంపెనీ 290 ఎకరాలలో సింతటిక్, జాకెట్లు, …
Read More »ప్రతి ఆడపిల్ల ఆత్మరక్షణ శిక్షణ తీసుకొవాలి..గవర్నర్
రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్ల ఆత్మరక్షణ సంబంధించిన శిక్షణ తీసుకొవాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. బుధవారం రామగుండంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బాలికలచే నిర్వహించిన కళరిపయట్టు కళాప్రదర్శనను గవర్నర్ దంపతులు తిలకించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ ఆత్మరక్షణ నేర్చుకొవడం మన జీవితానికి చాలా ఉపయోగపడతుందని, మనం శారిరకంగా, మానసికంగా ధృడంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయని గవర్నర్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో 15 …
Read More »నీలి విప్లవానికి మద్య మానేరు ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలి..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర జల కూడలి గా మారిన మధ్య మానేరు జలాశయంను నీలి విప్లవానికి కేంద్రబిందువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అధికారులకు సూచించారు. బుధవారం హైదరాబాద్ ప్రగతిభవన్ లో సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి పై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర మంత్రి తారక రామారావు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో …
Read More »యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం..మంత్రి కేటీఆర్ ఏమని ట్వీట్ చేశారంటే..!!
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. కొత్త హంగులతో ఆలయం భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ క్రమంలో ఆలయ పునర్నిర్మాణ పనులపై మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్ మరో గొప్పతనం అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆలయ పునర్నిర్మాణం మొత్తం రాతితోనే జరిగిందన్న ఆయన… రెండున్నర లక్షల టన్నుల గ్రానైట్ ను ఉపయోగించినట్లు తెలిపారు. యాదాద్రి ఆలయం …
Read More »ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు లోక్ సభలో ఎంపీ నామా నాగేశ్వర్ రావు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంపుపై.. అసెంబ్లీలో గతంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. రిజర్వేషన్ల పెంపుపై ప్రధానికి సీఎం కేసీఆర్ పలుమార్లు లేఖ రాశారని నామా గుర్తు చేశారు.ఈ రెండు అంశాలపై కేంద్రం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఆర్టికల్ 334లో పేర్కొన్న ఆంగ్లో ఇండియన్లపై …
Read More »