భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నూరు మండలం సోమన్‌పల్లి వద్ద నదిలో చిక్కుకున్న ఇద్దరు మేకల కాపరులను హెలికాప్టర్ ద్వారా సుక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మేకల కాపరులు వెనక్కి వచ్చే సమయానికి వరద ముంచెత్తడంతో నదిలో చిక్కుకున్నారు. అక్కడ సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి సహాయం కోసం ఎదురు చూశారు. వరద పెరిగిపోవడంతో వారిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయాన్ని …
Read More »ఏపీలో భారీ వర్షాలు.. రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే
తెలంగాణతో పాటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఎగువ నుంచి వస్తోన్న వరదతో పలు గ్రామాలు, కాలనీలు జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ రేపు ఏరియల్ సర్వేకు వెళ్లాలని నిర్ణయించారు. వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ పైనుంచి ఆయన పరిశీలించనున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా …
Read More »మరో ఐదు గంటల్లో.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. పలు జిల్లాల్లో నదులు, చెరువుల్లోకి వరదనీరు చేరడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రానున్న ఐదు గంటల్లో ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ …
Read More »భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. రాకపోకలు బంద్
భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఈరోజు మధ్యాహ్నానికి నీటిమట్టం 60.30 అడుగులకు చేరింది. దీంతో సమీపంలోని లోతట్టు కాలనీలకు వరదనీరు భారీగా చేరడంతో అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.గోదావరికి వరద నీటి ప్రభావం అధికంగా ఉండడంతో భద్రాచలం నుంచి చర్ల, కూనవరం వెళ్లే మార్గాల్లో రావాణా నిలిచిపోయింది. నేటి సాయంత్రం నుంచి గోదావరి బ్రిడ్జ్‌పై రాకపోకలను అధికారులు నిలిపివేయనున్నారు. దీంతో హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోనున్నాయి. గోదావరి …
Read More »తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక ఈ రోజు చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని హాస్పిటల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అలసట, జ్వరంగా అనిపించడంతో కరోనా టెస్ట్‌లు చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చిందని సీఎం ట్విట్టర్ ద్వారా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రజలను …
Read More »టీడీపీ గ్రాఫ్ లేవడం లేదు.. అందుకే ఆ సర్వే..: పేర్ని నాని
ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ పడిపోయిందనడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని అన్నారు. సెంటర్ ఫర్‌నేషనల్ స్టడీస్ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదేనని.. అందుకే వాళ్లు అలా నివేదిక ఇచ్చారని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి గ్రాఫ్‌పెంచుకోవాలని టీడీపీ చూసిందని.. కానీ అలా జరగలేదన్నారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ వల్ల గ్రాఫ్ లేవడం లేదని.. టీడీపీని కాపాడుకోవడానికే చేయించిన …
Read More »నెలరోజులకు బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉంచండి: కేసీఆర్ ఆదేశం
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో గోదావరి ఉద్ధృతి, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. విద్యుత్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వస్తున్న వరదను అంచనా వేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా మరో నెలరోజులకు సరిపడా బొగ్గు నిల్వలను సిద్ధం …
Read More »శ్రీలంకలో ఎమర్జెన్సీ.. కనిపిస్తే కాల్చివేతే!
శ్రీలంకలో ప్రజల ఆందోళన రోజురోజుకీ మరింత తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిపై దాడి చేసిన నిరసనకారులు.. ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటిపైనా దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ప్రధాని.. అక్కడి సైనిక దళాల అధిపతులతో చర్చించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించాలని నిర్ణయించారు. గొటబాయ రాజపక్స పరారవ్వడంతో తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో రణిల్ విక్రమసింఘే ఈ ప్రకటన …
Read More »హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ జరిగింది. మొత్తం 69 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు వ్యవహారం చర్చనీయాంశం అయిన నేపథ్యంలో భారీగా బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌గా రాపోలు శ్రీనివాస్‌రెడ్డి, సైఫాబాద్‌కు కె.సత్తయ్య, శాలిబండకు జి.కిషన్, బేగంబజార్‌కు ఎన్.శంకర్, ఆసిఫ్‌నగర్‌కు శ్రీనివాస్, రాంగోపాల్‌పేటకు జి.లింగేశ్వరరావు, మొగల్పురాకు శివకుమార్‌ను నియమించారు. ఈ మేరకు …
Read More »సీఎం జగన్‌తో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము భేటీ..
వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఈ మేరకు విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చిన ఆమెకు సీఎం జగన్, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇస్తున్నందుకు సీఎం జగన్ సహా పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును సీఎం జగన్ సన్మానించారు. …
Read More »