Home / Jhanshi Rani (page 3)

Jhanshi Rani

త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్: హరీశ్‌రావు

రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేంద్రం అగ్నిపథ్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని ఆయన అన్నారు. యువత జీవితాన్ని నాశనం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన విమర్శించారు. సిద్ధిపేటలో కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న యువతకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 వేలకు …

Read More »

వైజాగ్ సముద్ర తీరాన “నేవీ మారథాన్”.. 18 వేల మంది పరుగులు

విశాఖ పట్నం సాగర తీరాన నేవీ మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 18 వేలమంది యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పరుగులు తీశారు. ఈ మారథాన్.. ఫుల్ మారథాన్ 42కిలోమీటర్లు, ఆఫ్‌ మారథాన్‌ (21కే), 10కే, 5కే విభాగాల్లో జరిగింది. ఆర్‌కే బీచ్‌ సమీపంలోని కాళికాదేవి ఆలయం ఆవరణలో నేవీ ఆఫీసర్లు, సినీ నటులు అడవి శేషు, మిలింద్ సోమన్ …

Read More »

ఓటీటీలోకి కాంతార ఎప్పుడొస్తుందో తెలుసా..!

ఏ ఆర్భాటం లేకుండా కేవలం ఓ కన్నడ మూవీగా రిలీజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార సినిమా. ఒక్క భాషలోనే రిలీజ్ బ్లాక్‌బస్టర్‌ టాక్ దక్కించుకోవడంతో చకచకా ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ కోసం రెండు మూడు సార్లు థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఉన్నారంటే సినిమా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో సినీప్రియులు కాంతార ఎప్పుడడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతో …

Read More »

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతుబంధు

రాష్ట్ర రైతులకు తీపి కబురు తెలిపింది ప్రభుత్వం. డిసెంబరులో రైతు బంధు నగదును ఖాతాల్లో వేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైతు బంధు సాయం నిధులను రిలీజ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రెండో పంట సాగుకు రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయగా ఆర్థిక శాఖ ఆమోదించింది. రైతుబంధు కింద సంవత్సరానికి రెండు …

Read More »

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం!

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో పది మంది తీవ్రంగా గాయపడడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. మునగాల మండల కేంద్రం శివారులోని పెట్రోలు బంక్‌ వద్ద ఓ ట్రాక్టర్, లారీని ఢీకొట్టింది. ట్రాక్టర్ రాంగ్ రూట్‌లో వెళ్లడం వల్లనే ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి సమీపంలోని సాగర్ …

Read More »

వైజాగ్‌కు ఇవాళ మరపురాని రోజు: ప్రధాని మోడీ

ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని.. ప్రపంచవ్యాప్తంగా వారికి గుర్తింపు ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.10వేల కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. ‘ప్రియమైన సోదరీసోదరులారా.. నమస్కారం’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. ‘‘విశాఖపట్నానికి ఇవాళ మరపురాని రోజు. …

Read More »

కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనది: సీఎం జగన్‌

కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు, పార్టీలకు అతీతమైనదని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో ఎజెండా లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్‌ మైదానంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘దేశ ప్రగతి రథ సారథి ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. …

Read More »

‘ఓరి దేవుడా’.. ఈరోజే ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎందులో అంటే!

సినీప్రియులకు సడెన్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. మరికొన్ని గంటల్లో ఓరి దేవుడా సినిమా ఆహాలో అలరించనుంది. ఈరోజు (గురువారం) అర్ధరాత్రి 12 నుంచి ఓరి దేవుడా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా అభిమానులతో పంచుకుంది. ఆహా ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌కు సినీప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. విశ్వక్‌ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ ఫాంటసీ రొమాంటిక్‌ కామెడీగా …

Read More »

కూతురు పెళ్లికి గవర్నర్‌ను ఆహ్వానించిన అలీ

ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అలీ తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన పెద్ద కూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా గవర్నర్‌కు అలీ శుభలేఖ ఇచ్చి తప్పకుండా పెళ్లికి రావాలని ఆహ్వానించారు. పెళ్లిపత్రికను అందుకున్న గవర్నర్‌ అలీకి శుభాకాంక్షలు తెలిపి పెళ్లికి కచ్చితంగా హాజరవుతానని చెప్పారు. ఇక ఈ మధ్యే అలీ కూతురు ఫాతిమా ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. మరోవైపు అలీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat