ఈ శారీలో తమన్నాను చూస్తే దట్‌ఈజ్ మహాలక్ష్మి అనాల్సిందే!
ఒకే ఫ్రేమ్‌లో అగ్ర నటులు.. రీ యూనియన్‌లో సెలబ్రిటీల సందడి!
టాలీవుడ్, బాలీవుడ్ 80 నాటి అగ్ర నటులు ఒకే చోట కనువిందు చేశారు. ఇండ్రస్ట్రీలో హీరో హీరోయిన్లు, సహా నటుల మధ్య చక్కటి అనుబంధం ఉంటుంది. అందరికీ చాలా మంది అభిమానులు ఉంటారు. ఒకరు ఇద్దరు స్టార్లను ఒక్క చోట చూస్తేనే అభిమానులు రెండు కళ్లు చాలవు. అలాంటిది అలనాటి స్టార్లు అంతా ఒక్కచోట చేరితే ఆ సందడి మామూలుగా ఉండదు. అభిమానులకు అయితే కన్నుల పండుగే. తాజాగా 80 …
Read More »నటుడు కార్తి ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్.. ట్వీట్ చేసిన హీరో!
తమిళ స్టార్ హీరో కార్తి ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని కార్తి ట్విటర్ వేదికగా తెలిపారు. హాయ్ ఆల్.. నా ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అయ్యింది. ప్రస్తుతం టెక్నికల్ టీంతో కలిసి పనిచేస్తున్నాం. త్వరలోనే అకౌంట్‌ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. అని ట్వీట్ చేశారు. కార్తి తన సినిమాలకు సంబంధించిన ఏ అప్‌డేట్‌లైనా, పర్సనల్ విషయాలైనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఈ ఏడాది కార్తి …
Read More »వెంటిలేటర్‌పై సూపర్‌స్టార్ కృష్ణ.. సీరియస్ అంటున్న వైద్యులు!
సూపర్‌స్టార్ కృష్ణ ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో మహేశ్‌బాబు, నమత్ర, కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. రాత్రి దాదాపు 2 గంటల సమయంలో సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పటికి కృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేశారు వైద్యులు. 20 నిమిషాలు …
Read More »ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కి జక్కన్న గుడ్ న్యూస్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కి ప్రముఖ దర్శకుడు రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. కొద్దినెలల క్రితం ఆయన దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు సీక్వెల్‌పై ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్ 2’పై అభిమానులు అడిగిన ప్రశ్నపై జక్కన్న స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సీక్వెల్ ఉంటుందని.. ఇప్పటికే దీనిపై చర్చలు జరిగిగాయని చెప్పారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి సంబంధించిన కథను రాసే పనిలో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. …
Read More »అందుకే పవన్‌ను మోదీ దూరం పెట్టేశారు: మంత్రి రోజా
చిత్తూరు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురించి ప్రజలు ఆలోచించడమే మానేశారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆయన ఎప్పుడు ఎవరితో, ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాదని వ్యాఖ్యానించార. చిత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంతో అభిమానించే ప్రధాని మోడీ.. పవన్‌ను పక్కన పెట్టారని చెప్పారు. రౌడీయిజంతో రోజుకో పార్టీ వైపు మాట్లాడుతుండటంతో ఆయన ప్రవర్తన చూసే ప్రధాని దూరం పెట్టేశారని రోజా …
Read More »మంచంపై నిద్రిస్తున్న యువతి సజీవ దహనం..!
తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రాత్రి పూట మంచంపై పడుకున్న ఓ అమ్మాయి సజీవ దహనం అయ్యింది. ముద్దాపురం గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్, గజ్జరపు వసంత దంపతులు. వీరికి హారిక సంతానం. హారిక బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి మంచం మీద పడుకుండా సజీవ దహనమైంది. అయితే ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుండగా షార్టు సర్కూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని హారిక తండ్రి శ్రీనివాస్, …
Read More »అమ్మానాన్నల్లో ఎవరు కావాలి..? పాప జవాబుకు చలించి అక్కున చేర్చుకున్న జడ్జి!
ఆ ఆరేళ్ల చిన్నారి తల్లిదండ్రులు విడిపోవాలని కోర్టును ఆశ్రయించారు. పాప ఎవరి దగ్గర ఉండాలని విషయమై జడ్జి ఆ చిన్నారిని అమ్మ కావాలా.. నాన్న కావాలా.. అని అడిగింది. దీంతో ఆ చిన్నారి తడుముకోకుండా చెప్పిన ఆన్సర్‌కు జడ్జి సైతం చలించిపోయారు. షాద్‌నగర్ పట్టణంలోని కోర్టులో శనివారం ఈ ఘటన జరిగింది. కల్వకుర్తి పరిధిలోని మాడ్గుల గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమకు డివోర్స్ కావాలంటూ లోక్‌అదాలత్‌లో భాగంగా న్యాయమూర్తిని ఆశ్రయించారు. …
Read More »ఎయిర్‌షోలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి!
అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో దారుణం చోటుచేసుకుంది. వెటర్స్ గౌరవార్థం మూడు రోజుల పాటు ఎయిర్‌షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెండు యుద్ధ విమానాలు ఎయిర్‌షో చేసేందుకు గాల్లో ఎగరగా రెండు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు సిబ్బంది మృతి చెందారు. ఈ విషయాన్ని ది ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రెండు విమానాలు బోయింగ్ …
Read More »