Home / Jhanshi Rani (page 19)

Jhanshi Rani

“లూసిఫర్ కంటే గాడ్‌ఫాదరే కింగ్”

లూసిఫర్ కంటే గాడ్‌ఫాదర్ సినిమా చాలా బాగుంది అని ఆ మూవీ డైరెక్టర్ మోహన్ రాజ్ తండ్రి, ప్రముఖ ఎడిటర్ మోహన్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ మూవీ సక్సెస్‌ అవ్వగా తాజాగా ఓ ఇంటర్వూలో మోహన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. లూసీఫర్ మూవీ కంటే గాడ్‌ఫాదర్ రోల్ కింగ్‌లా ఉంటుందని అన్నారు. టీమ్‌ అంతా కలిసి గాడ్‌ఫాదర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. లూసిఫర్ సినిమాను మహిళలు ఇష్టపడతారో లేదో …

Read More »

జొమాటో బాయ్‌కి బొట్టు పెట్టి.. అక్షింతలు వేసిన కస్టమర్!

ఆన్‌లైన్‌లో ఫుడ్ తొందరగా వచ్చేస్తోందని ఎక్కువ మంది ఇంట్లో ఫుడ్ కంటే జొమాటో, స్వీగ్గీల్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు. వాటిలో ఫుడ్ డెలివరీ అనుకున్న టైంలో రాకుంటే డెలివరీ బాయ్‌పై కోపంతో నోటికొచ్చినట్లు తిట్టేస్తారు. రేటింగ్ తక్కువ ఇస్తారు. అయినా కోపం తగ్గకపోతే ఫుడ్‌ను వెనక్కి పంపేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా దిల్లీలోని ఓ పెద్దాయన ప్రవర్తించారు. అనుకున్న టైం కంటే గంట లేటుగా వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్‌పై …

Read More »

లవ్‌లో అర్జున్‌రెడ్డి-రష్మిక.. మాల్దీవులు టూర్ వైరల్!

విజయ్‌ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు వీరిద్దరూ ముంబయి ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు. రష్మిక ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఫొటోలకు పోజిచ్చింది. కొంత సమయం తర్వాత విజయ్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఇద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్తున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి …

Read More »

మునుగోడు ఎన్నికకు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఖరారు

  త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీ. మునుగోడు టికెట్‌ కోసం చాలా మంది పార్టీ సీనియర్ నాయకులు ప్రయత్నించారు. తీవ్ర చర్చల అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఫైనల్ చేశారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ ఎన్నికకు ఇటీవల ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 3న పోలింగ్ జరుగుతుంది. …

Read More »

కాబోయే అల్లుడికి ‘పొట్టపగిలే’ షాక్.. 125 వెరైటీలు!

 త్వరలో తమ ఇంటి అల్లుడు కానున్న ఆ అబ్బాయికి పొట్టపగిలి పోయే షాక్ ఇచ్చారు అట్టింటివారు. పొట్ట పగలడం ఏంటి అని అనుకుంటున్నారా.. మరే లేందండి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచిన అత్తవారు అతడికి విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో విందులో ఐటమ్స్‌ తింటే పొట్టపగలడం ఖాయం.. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. విజయనగరం జిల్లా ఎస్‌కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కొడుకు చైతన్యకు …

Read More »

ఒకట్రెండు కాదు.. 432 ఫోన్లు కొట్టేశారు.. సీసీ కెమెరాల్లో దొరికేశారు..!

సిటీలోని ఈసీఐఎల్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో గత నెల 21న చోరీ జరిగింది. దొంగలు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 432 సెల్‌ ఫోన్లు కొట్టేశారు. వాటి విలువ రూ.70 లక్షలు. దీంతో బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆ కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన ఇద్దర్ని అరెస్టు చేశారు. ఈసీఐఎల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఝార్ఖండ్‌కు చెందిన షేక్ సత్తార్, …

Read More »

ఓటీటీలో లాల్ సింగ్ చడ్డా.. ఎందులో అంటే!

బాలీవుడ్‌ స్టార్ అమీర్‌ఖాన్ హీరోగా నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. నాగచైతన్య కీలకపాత్రలో కనిపించారు. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ బాయ్‌కాట్‌ సెగ వల్ల బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు లాంగ్వేజ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కరీనాకపూర్‌ హీరోయిన్‌.

Read More »

ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత!

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి కడ్డీల రూపంలోని 7 కేజీల బంగారం తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్‌ సుమారు నాలుగు కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read More »

గాడ్‌ఫాదర్‌ ప్రమోషన్స్‌కు అందుకే అనసూయ రాలేదు!

మోహన్‌రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ మూవీ దసరా కానుకగా థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీలో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర అయిన న్యూస్‌ ఛానెల్ రిపోర్టర్‌గా కనిపించారు. యాంకర్ యాక్టింగ్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటూ.. సినిమా ప్రమోషన్స్‌లో ఆమె ఎక్కడా కనిపించలేదని కామెంట్స్‌ పెడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన అనసూయ ఏం చెప్పారంటే.. గాడ్‌ఫాదర్‌లో అనసూయ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat