Home / Jhanshi Rani (page 12)

Jhanshi Rani

బాణసంచా షాపులో భారీ అగ్నిప్రమాదం!

తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని నారాయణదాసు తోటలో దారుణం జరిగింది. దీపావళి సందర్భంగా బాణసంచా పెద్దగా ఏర్పాటు చేసిన దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సంబంధిత దుకాణంలో శనివారం రాత్రి క్రేకర్స్ అమ్ముతుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అక్కడున్నవారంతా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో దాదాపు రూ.20 లక్షల విలువ చేసే టపాసులు పేలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా …

Read More »

ఇఫి వేడుకలో ఆర్‌ఆర్‌ఆర్‌, అఖండ సినిమాల ప్రదర్శన

గోవాలో వచ్చే నెల 20 నుంచి 28 వరకు 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా జరగనుంది. ఇందులో మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్‌లో తెలుగు సినిమాల ప్రదర్శన జరగనుంది. వాటిలో రాజమౌళి దర్శకత్వలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌, బాలకృష్ణ నటించిన అఖండ ప్రదర్శిస్తారు. ఇవి కాకుండా మరో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఎంపికయ్యాయి. వీటిలో తెలుగులో కండ్రేగుల ప్రవీణ్ …

Read More »

దారుణం: యువతిపై 10 మంది అత్యాచారం

ఝార్ఖండ్‌లోని చాయీబాసా ప్రాంతంలో దారుణం జరిగింది. ఫ్రెండ్‌తో సరదాగా బయటకు వెళ్లిన ఓ యువతిపై 10 యువకులు అత్యాచారం చేశారు. ఆపస్మారక స్థితిలోకి చేరుకున్న యువతి తేరుకొని కుటుంబ సభ్యులకు చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తోన్న యువతి ప్రస్తుతం ఇంట్లో ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తుంది. గురువారం సాయంత్రం తన స్నేహితుడితో కలిసి స్కూటీపై చాయీబాసా శివారులోని ఎయిర్‌పోర్ట్ …

Read More »

‘ఆ సౌండ్‌ను ఫాలో అవ్వొద్దు.. అదో సెంటిమెంట్’

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది కాంతార మూవీ. ఓ వైపు డైరెక్షన్ చేస్తూనే హీరోగా అద్భుతంగా నటించారు రిషబ్ శెట్టి. ఈ సినిమాను కర్ణాటక, తమిళనాడులోని ఆచారాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఈ మూవీ ద్వారా అక్కడి భూతకోల సంస్కృతిని యావత్తు దేశానికి తెలియజేశారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాలలో దేవుడు ఆవహించిన సమయంలో కోల ఆడే వ్యక్తులు ఓ.. అంటూ ఓ వింత …

Read More »

అటు నుంచి ఒక బుల్లెట్‌ వస్తే ఇటు నుంచి దీపావళే..!

రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ధమాకా. యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ మూవీ టీజర్‌ను దీపావళి వేడుకల సందర్భంగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ టీజర్‌కు ధమాకా మాస్ క్రాకర్‌ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ టీజర్‌ రవితేజ ఫ్యాన్స్‌తో పాటు మాస్‌ ఆడియన్స్‌ చేత ఈలలు వేయిస్తోంది. నేను నీలో ఒక విలన్‌ని చూస్తే.. నువ్వు నాలోని హీరోని చూస్తావు. కానీ …

Read More »

సీక్రెట్‌గా పెళ్లి.. పబ్లిక్‌లో కాలిబూడిద!

పెళ్లయి విడాకులు తీసుకున్న ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ యువతి. సరిగ్గా 5 నెలలు అయ్యేసరికి పోలీస్‌ స్టేషన్‌కు పరుగు పెట్టింది. ఇంతలో ఏమైందో ఏమో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. విశాఖ పట్నంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన 22 ఏళ్ల శ్రావణి వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో లా చదువుతోంది. అదే కాలేజ్‌లో చదువుతోన్న వినయ్‌కుమార్ అనే తన సీనియర్‌తో ప్రేమలో …

Read More »

జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్.. రచ్చ రచ్చ చేస్తోన్న రామ్-భీమ్!

ఆర్ఆర్ఆర్.. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయి మన థియేటర్లలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దేశం దాటి జపాన్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది ఆర్‌ఆర్ఆర్. శుక్రవారం జపాన్‌లో ఈ మూవీ విడుదల చేయనున్నారు. అందుకు గాను ఇప్పటికే రామ్, భీమ్‌ ఫ్యామీలీలతో పాటు జక్కన్న జపాన్ చేరుకున్నారు. మూవీ ప్రమోషన్లను అక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నారు. గతంలో రాజమౌళి బాహుబలి సినిమాకు జపాన్‌లో మంచి క్రేజ్ దక్కింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat