కరోనా బాధితులకు సహాయం చేయడానికి దక్షిణాదికి చెందిన ఓ నటుడు అంబులెన్స్ డ్రైవర్‌గా మారిపోయారు. కరోనా పేషెంట్లను దవాఖానకు తీసుకెళ్లడం, దవాఖాన నుంచి ఇంటికి తీసుకెళ్లడం చేస్తూ శహబాష్ అనిపించుకుంటున్నారు సౌతిండియాకు చెందిన నటుడు అర్జున గౌడ.
యువరాథన, రుస్తోమ్ సినిమాలతో మంచి ఇమేజ్ను సంపాదించుకున్న అర్జున గౌడ.. ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్‌లో సభ్యుడిగా చేరి నిరేపేదలకు సేవలందిస్తున్నాడు. కరోనా సోకిన వారిని దవాఖానలకు తీసుకెళ్లడం, చనిపోయిన వారిని శ్మశాన వాటికకు తరలించడం వంటి పనులు చేస్తున్నాడు.
నేను గత కొన్ని రోజులుగా బెంగళూరు వీధుల్లో ఉన్నాను. దాదాపు ఆరు మృతదేహాలను శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలను నిర్వర్తించాను” అని అర్జున్ గర్వంగా చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చినా, ఏ మతం వారైనా ప్రతి పేదవారికి సహాయం చేసేలా ముందుకొస్తున్నాం. సహాయం అందించేందుకు నగరం అంతటా ఎక్కడైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సినిమాల నిర్మాణం నిలిచిపోయినందున ఇకపై ఇలాంటి సేవలకే తన సమయాన్ని వెచ్చిస్తానని, ఈ రకం సేవలు అందించడంలో ఎంతో ఆనందం ఉన్నదని అర్జున్ గౌడ్ పేర్కొన్నారు.
Post Views: 367