బుధవారం కేకేఆర్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం సాధించింది. 221 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్ ఆటగాళ్లు చెన్నై బౌలర్లను భయపెట్టారు.
కానీ 202 పరుగులకు ఆలౌటైంది. చెన్నై 18 రన్స్ తేడాతో గెలిచింది. కార్తీక్ (40), రస్సెల్ (54), కమిన్స్ (66) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అంతకుముందు గైక్వాడ్ (64), డుప్లెసిస్ (95*) రాణించడంతో చెన్నై 220/3 రన్స్ చేసింది. చాహర్ 4, ఎంగిడి 3, కరన్ 1 వికెట్ తీశారు.