కరీంనగర్ ఆర్టీసీ వర్క్ షాప్ ఆస్పత్రిలోని వాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు… వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మొదటి డోస్ టీకా తీసుకున్నారు..కరోనా వాక్సినేషన్ పట్ల ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీకా కేంద్రంలో ఉన్న సదుపాయాలు, టీకా సరఫరాలపై అధికారులతో చర్చించి నిరంతరం టీకా అందుభాటులో ఉంచేలా ఆదేశాలిచ్చారు. ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని టీకా నూటికి నూరు శాతం సురక్షితమైనదే కాక, కరోనా ఉద్రుతి నుండి ఖచ్చితంగా బయటపడేస్తుందని భరోసానిచ్చారు.
టీకా తీసుకున్నప్పటికీ మాస్క్, బౌతికధూరం పాటించినప్పుడే పూర్తిగా కరోనా నుండి రక్షణ లభిస్తుందని చెప్పారు . కరోనా అందరికి ప్రాణాంతకమైనది కాకున్నా కొంతమందిలో తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో అలాంటి వారిని కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ భాద్యతగా మెలగాలన్నారు. మంచి ఆహార అలవాట్లు పాటిస్తూ, శారీరక వ్యాయమం, యోగా వంటి వాటి ద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉండాలన్నారు, వేగంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తప్పనిసరిగా మాస్క్, భౌతికధూరాన్ని పాటించాలని విజ్ణప్తి చేశారు మంత్రి గంగుల కమలాకర్.
నేనొక్కన్ని మాస్క్ దరించకపోతే ఏంటీ అనే నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. ఎప్పుడూ చేతుల్ని శుబ్రపరుచుకుంటూ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గాలి ద్వారా సైతం కరోనా వైరస్ విస్తరిస్తుందని శాస్త్రజ్నులు చెప్తున్న నేపథ్యంలో అపార్మెంట్లు, గ్రుహసముదాయాల్లోని ఇండ్లలో సైతం మాస్క్ విదిగా దరించే ఉండాలని సూచించారు . ఏ మాత్రం అజాగ్రత్త గా ఉన్నా పరిస్థితి చేయిదాటిపోతుందని, హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని అప్పుడు కనీస వైద్యానికి సైతం ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండి సమాజాన్ని కాపాడే గురుతర భాద్యతని నిర్వర్తించాలన్నారు ..
హాస్పిటళ్లో బెడ్లను, మందులను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రైవేటు హాస్పటళ్లలో సైతం అధిక ధరల్ని ప్రభుత్వం నియంత్రిస్తుందని. ఎవరైనా నిబందనల్ని అతిక్రమిస్తే తీవ్ర చర్యలుంటాయన్నారు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటిస్తూ కోవిడ్ ని తరిమికొట్టాలని ఆకాంక్షించారు మంత్రి గంగుల కమలాకర్.