టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ‘ ఘోస్టి’ అనే హర్రర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి ‘గులేబకావళి, జాక్పాట్ ‘ల దర్శకుడు కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ పోలీస్ అధికారిగా అలరించనుంది.
యోగిబాబు, ఊర్వశి, శ్రీమాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టే దెయ్యాలను ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా కట్టడి చేసిందనేదే కథ. ఈ మూవీ తెలుగు, తమిళంలోనూ అదే పేరుతో విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది.