ఇటీవలే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన అంతర్రాష్ట్రీయ కబడ్డీ పోటీలను జిల్లా మంత్రి మల్లారెడ్డి గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి గారు గాయపడగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీలు నవీన్ రావు గారు, శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ గారు, మాధవరం కృష్ణా రావు గారు మంత్రి మల్లారెడ్డి గారిని బోయిన్ పల్లి లోని తన నివాసం వద్ద కలిసి పరామర్శించారు.