ఏఫ్రిల్ పదిహేడో తారీఖున జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ మాజీ మంత్రి అయిన కుందూరు జానారెడ్డి బరిలోకి దిగుతున్న సంగతి విదితమే. నిన్న మంగళవారం మార్చి ముప్పై తారీఖున జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఆయన తనకు ,తన కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తుల వివరాలను తెలిపారు. ఈ క్రమంలో తన పేరు మీద కంటే ఆయన భార్యపై ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.
ఇద్దరి ఆస్తుల విలువ మొత్తం అక్షరాల 19.24కోట్లుగా తెలిపారు. అయితే ఇందులో తన పేరు మీద 3.32కోట్లు,భార్య సుమతికి 15.91కోట్ల ఆస్తి ఉన్నట్లు ఆయన తెలిపారు.
అయితే తనకు ఎలాంటి అప్పులు కానీ కేసులు కానీ లేవు అని అన్నారు. మరో విశేషం ఏంటంటే అటు ఏపీ ఇటు తెలంగాణలోనే అత్యంత సీనియర్ మాజీ మంత్రి అయిన జానారెడ్డి ఇప్పటివరకు తనకు సొంత కారు లేదని పేర్కొనడం గమనార్హం.