దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,258 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,08,910కు చేరింది. అటు నిన్న కరోనాతో 291 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,61,240కు పెరిగింది. ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,52,647గా ఉంది అటు దేశంలో ఇప్పటివరకు 5.81 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు