తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తారని వస్తున్న వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభ వేదికగా క్లారిటీచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ విధించం అని ప్రకటించారు.
శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. లాక్‌డౌన్ అనేది పెట్టం. పరిశ్రమల మూసివేత ఉండదు. ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం. కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.
మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తే కరోనాను నియంత్రించొచ్చు. బాధతోనే స్కూళ్లను మూసివేశాం అని సీఎం స్పష్టం చేశారు.. విద్యాసంస్థలను తాత్కాలికంగానే మూసివేశామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరారు