తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. మొన్న మంగళవారం మొత్తం 70,280 పరీక్షలు నిర్వహించగా మొత్తం 431 మందికి కరోనా పాజిటీవ్ గా తేలింది.
ఈ ప్రకటనను తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు బుధవారం మీడియాకు విడుదల చేశారు. అయితే రాష్ట్రంలో అత్యధికంగా రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీ పరిధిలోనే 111 కరోనా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 37,రంగారెడ్డి జిల్లాలో 31,మంచిర్యాల,జగిత్యాల జిల్లాలో21చొప్పున కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు.