తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 431 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3,04,298కు చేరింది. కొత్తగా 228 మంది హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 2,99,270 మంది కోలుకున్నారని చెప్పింది.
24 గంటల్లో మరో ఇద్దరు వైరస్ బారినపడి మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,676కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55శాతం, రికవరీ రేటు 98.34శాతం ఉందని తెలిపింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 3,352 యాక్టివ్ కేసులున్నాయని, మరో 1,359 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారని వివరించింది. నిన్న ఒకే రోజు 70,280 నమూనాలను పరిశీలించామని, ఇప్పటి వరకు 97,89,113 పరీక్షించినట్లు వివరించింది. మిలియన్ జనాభాకు 2,63,006 మందికి టెస్టులు చేస్తున్నామని తెలిపింది.