దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 40,715 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. కొత్తగా 29,785 మంది కోలుకోగా.. 1,11,81,253 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది.
వైరస్ ప్రభావంతో మరో 199 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,60,166కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 3,45,377 ఉన్నాయని చెప్పింది. వ్యాక్సిన్ డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 4,84,94,594 డోసులు వేసినట్లు వివరించింది. మరో వైపు వ్యాక్సిన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది.
నిన్న ఒకే రోజు 9,67,459 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 23,54,13,233 శాంపిల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.