ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి విధితమే.
ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ”తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని అన్నారు..
ఈ సందర్భంగా పార్టీ ప్రకటనతోపాటు పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. ఏప్రిల్ 9న లక్షమంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్లు షర్మిల తెలిపారు. తెలంగాణలో రాజన్నరాజ్యం స్థాపనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని అభిమానులు షర్మిలను కోరారు