ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్ర పడిన ప్రముఖ టాప్ టెన్ మీడియా పత్రిక ,ఛానల్స్ లో ప్రసారమై వార్త జగన్ క్యారెక్టర్ మంచిది కాదు ..ఎవరు చెప్పిన వినరు ..ఎవరి మాటను లెక్క చేయరు .అధికారులు అయిన ఆఖరికి సామాన్య ప్రజానీకమైన జగన్ లెక్క చేయరు అని గత మూడున్నర ఏండ్లుగా విషప్రచారం చేస్తున్న సంగతి విదితమే .అయితే జగన్ ను కల్సినవారు ..
జగన్ తో సమావేశం అయినవారు ఎవరైనా సరే జగన్ చేసే మర్యాదలకు ..చూపించే అభిమానానికి ఫిదా కావడం ఖాయం అని ఆయన్ని కల్సినవారు ఎవరైనా చెప్తారు .తాజాగా జగన్ క్యారెక్టర్ ఏమిటో అద్దం పట్టే సంఘటన రాష్ట్రంలో తిరుమల లో చోటు చేసుకుంది .అసలు విషయానికి వస్తే రేపటి నుండి రాష్ట్రంలో నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ తిరుమల తిరుపతి దేవాలయాన్ని నిన్న దర్శించుకున్నారు .ఈ క్రమంలో జగన్ తిరుమలలో విమానాశ్రయానికి తిరుగుప్రయాణం కావడానికి వచ్చారు .
అక్కడ పనిచేస్తోన్న సిబ్బంది జగన్ రావడాన్ని చూసి కలవడానికి వచ్చారు .ఒకపక్క తన విమానం బయలుదేరడానికి సమయం దగ్గర పడుతున్న కానీ తనను కలవడానికి వచ్చినవారి కోసం ఆగి మరి వాళ్లతో మాట్లాడారు .ఈ సందర్భంగా జగన్ వాళ్ళను వారి సమస్యలను అడిగి మరి తెలుసుకున్నారు .రానున్నది రాజన్న రాజ్యం ..అప్పుడు మీ సమస్యలన్నీ తీరుస్తాం అని హామీ ఇచ్చారు .ఈ సందర్భంగా ఈ విమానాశ్రయానికి అధికార పార్టీ నేతల దగ్గర నుండి మంత్రుల వరకు ఎంతో మంది వస్తుంటారు .పోతుంటారు .కానీ మా యోగక్షేమాల గురించి ఒక్కరు కూడా పట్టించుకోరు .కనీసం తమ సమస్యలను విన్నవించుకోవాలని ప్రయత్నించిన కానీ మాకు చిక్కరు .కానీ జగన్ ఒకవైపు విమాన ప్రయాణానికి సమయం దగ్గర పడుతున్న ఆగి మరి మా యోగక్షేమాలను అడిగి మరి తెలుసుకొని రానున్న కాలంలో తమకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం ఆయన మంచితనానికి ..నిఖార్సైన రాజకీయ నేతకు ఉన్న మంచి లక్షణం అని వారు జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు .