ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బయో ఏషియా-2021 ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. టీకాల రాజధానిగా హైదరాబాద్ అని చెప్పుకోవడం గర్వకారణం అని పేర్కొన్నారు.
భారత్ బయోటెక్ సంస్థ కొవార్టిన్ టీకాను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని అన్నారు..