దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మహిళ, శిశు భద్రత విభాగం ఆధ్వర్యంలో ఈ డెస్క్ పనిచేస్తుంది.
ట్రాన్స్ జెండర్లకు ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని.. అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇబ్బందులుంటే వాట్సాప్ నంబర్ 949067444కు తెలియజేయాలని సూచించారు