తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం నీటితో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదని మహారాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విజయ్ ఓడేటివార్ కొనియాడారు.
వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో జీఆర్ఆర్ కాటన్ మిల్లును ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం విజయ్ ఓడేటివార్ మాట్లాడుతూ.. ఇరు రాష్ర్టాల ప్రజల ఇబ్బందులను తొలగించడానికి ఎప్పుడూ ముందుంటానన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు