తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కొత్త మేయర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మద్దతుదారులు పలువురు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అనధికారికంగా వాటిని ఎలా పెడతారంటూ నెటిజన్లు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు.
ఈవీడీఎం విభా గం శనివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తించారు. మొత్తం 30 చలాన్లు రాసి, సుమారు రూ.6లక్షల జరిమానాను విధించారు.