తెలంగాణ ,ఏపీ రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణకు హాజరుకాకపోతే వారెంట్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఏసీబీ కోర్టు హెచ్చరించింది.
నిన్న విచారణకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ ఉదయ్ సింహ హాజరుకాగా, పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి రాలేదు.
ఇవాళ మాత్రం తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలతో వీలైనంత వేగంగా విచారణ చేపట్టాలని పేర్కొంది