ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని కోరుతూ వైఎస్ఆర్సిపి రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షులు శీలం శ్రీను ఆద్వర్యంలో నందిగామ HBL కంపెనీ ఆవరణలో గల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
3000 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పాదయాత్రలో జగన్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటారని, అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కలలుగన్న సువర్ణ పాలన ప్రజలకు అందాలంటే జగన్ గారు సి.యం కావడం ఒక్కటే మార్గమని తెలపడం జరిగింది. సంకల్ప యాత్ర విజయవంతానికి అందరూ సహకరించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా యువత ప్రదాన కార్యదర్శి పత్తి సంతోష్, నందిగామ మండల యువత అధ్యక్షులు వంశీ రెడ్డి, కొందుర్గ్ మండల యువత అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, బైరమోని చంద్రశేఖర్, నరేష్ చారి, ప్రసన్న కుమార్, రాజు రెడ్డి, బి. శివ, బైండ్ల శివ, వీర, శివ చారి, శ్రీకాంత్ యాదవ్, సాగర్, ప్రకాష్, నరేందర్, గోపాల్, అజయ్, భాను, వెంకటేష్, గణేష్ మరియు తదితరులు పాల్గొన్నారు….