ప్రజా కళాకారుడు పైలం సంతోష్ ను స్మరిస్తూ అంబటి వెంకన్న రాసిన పాటను సంతోష్ బిడ్డ స్నేహ హృద్యంగా ఆలపించిన గీతాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అరుదైన గొప్ప కళాకారుడు పైలం సంతోష్ అని, తెలంగాణ ఉద్యమంలో తను పోషించిన పాత్రను ఏనాడు మరువలేమని అన్నారు.
రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలోనే గౌరవనీయ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ సాంస్కృతిక సారథి ని ఏర్పాటుచేసి ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలను ఇవ్వడం ప్రపంచం గర్వించ దగిన అంశమని అన్నారు. ప్రశాంత జీవితాన్ని అనుభవిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా చనిపోవడం చాలా బాధాకరమైన అంశం.
ఈ సందర్భంగా ఆయనకు జోహార్లు అర్పిస్తూ ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటును అందిస్తుందనీ అన్నారు. తన తండ్రిని స్మరిస్తూ “నాన్న నన్ను కన్న తండ్రి” అంటూ స్నేహ పాడిన పాట కన్నీరు పెట్టించే విధంగా ఉన్నదని ఆమెను మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పైలం సంతోష్ అల్లుడు నెమ్మది వీరబాబు, స్నేహ తల్లి శాంత, మనవడు అవినాష్, మనవరాలు తెలంగాణా మేఘన తదితరులు పాల్గొన్నారు.