అటు ఏపీ తెలుగు మీడియాలో ఇటు ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరును మార్చుకున్నారు .ఇక నుండి ఎవరైనా సరే తనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకుండా జేఎంఆర్ అని పిలవాలని ఆదేశాలను జారిచేశారు అని వార్తలను గత కొద్ది రోజులుగా తెగ ప్రచారం చేస్తోన్నారు .
అటు తెలుగు మీడియా ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై వైసీపీ శ్రేణులు స్పందించాయి.వైసీపీ శ్రేణులు స్పందిస్తూ పేరు మార్పు వార్తలను ఖండించాయి.ఇటువంటి బేస్ లేని వార్తలను నమ్మవద్దని వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలను, అభిమానులను ,ప్రజలను కోరాయి.
అలాగే ఇటువంటి వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని మీడియాను కోరాయి. ఏదైనా ముఖ్యమైన అంశం కానీ, కార్యక్రమం కానీ ఉంటే మీడియా సమావేశంలోనో, పత్రికా ప్రకటన ద్వారానో తెలియజేస్తామని వైసీపీ వర్గాలు పేర్కొన్నారు.