కరోనా వ్యాప్తి తగ్గేంతవరకు OTP, ఐరిస్ల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చౌక ధరల దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రాన్ని వినియోగించడం ద్వారా వైరస్ ప్రబలే అవకాశముందన్న.. హైకోర్టు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఫిబ్రవరి 1నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది ఈ విషయమై మార్గదర్శకాలు జారీచేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ కలెక్టర్లకు సూచించారు.