కపూర్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడదు. ఒకప్పటి స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురైన సోనమ్ నటించిన చిత్రాలు ఆకట్టుకున్నా అమ్మడికి మాత్రం సరైన బ్రేక్ ఇవ్వలేదు. ఇలాంటి నేపథ్యంలో తన ఫొటో షూట్ తో వార్తల్లోకి వచ్చింది సోనమ్.
ఈ మధ్య కాలంలో సోనమ్ కపూర్ ఇంత అందంగా ఎప్పుడూ కనిపించలేదు అని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజా ఫొటో షూట్ విషయంలో సోనమ్ కు ఈ విధమైన అభినందనలు అందుతున్నాయి. Beauty is power, a smile is its sword అనే కోట్ ను ఉపయోగించి ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రమ్ లో పోస్టు చేశారు. సోనమ్ స్టిల్స్‌కు ఈ కోట్‌కు చక్కటి సాపత్యమే అగుపిస్తోంది కదా.. అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.