నిమ్మకాయతో ఆరోగ్యాన్ని అనేక రకాలుగా కాపాడుకోవచ్చు. పరగడుపున గొరువెచ్చని నీళ్లలో తేనెతో నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది.
నీరసంగా ఉన్నప్పుడు సెలైన్ కి ప్రత్యామ్నాయంగా కొబ్బరినీళ్లలో నిమ్మరసం పిండుకొని తాగితే వేగంగా పనిచేస్తుంది. నిమ్మరసంలో పసుపు కలుపుకొని తోమితే చిగుళ్లు పళ్లు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ప్రయాణంలో వాంతులు రాకుండా ఉండటానికి నిమ్మకాయ వాసనని పీల్చితే ఉపశమనం లభిస్తుంది