సున్నితమైన భావోద్వేగాలతో అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. ఫిదా చిత్రంతో అందరిని ఫిదా చేసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ అనే అందమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.
కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో చైతూ, సాయి పల్లవి మధ్య ప్రేమ చాలా ఫీల్‌తో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం అంశాల కలబోతగా ఈ సినిమాని తెరకెక్కించినట్టు అర్ధమవుతుంది. పవన్ సి హెచ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అతి త్వరలోనే చిత్రాన్ని థియేటర్స్‌లోకి తీసుకురానున్నారు.