Home / MOVIES / కంగారు పెట్టిస్తున్న..”2.0″

కంగారు పెట్టిస్తున్న..”2.0″

ద‌ర్శ‌కుడు శంక‌ర్ చిత్రాలు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలుగులో రాజ‌మౌళి ఎలాగైతే త‌ను తీసే సినిమాని చెక్కుతూ ఉంటాడో.. శంక‌ర్ కూడా త‌న సినిమాని ఎటువంటి కాంప్ర‌మైజ్‌లకు చోటివ్వ‌కుండా చెక్కుతూనే ఉంటాడు. దీంతో ఒక్కోసారి వారి చిత్రాల రిలీజ్ డేట్లు మారిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా ర‌జనీ కాంత్‌తో 2.0 సినిమాని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు.

శంక‌ర్- ర‌జ‌నీ కాంబోలో వచ్చిన రోబో చిత్రం ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందుకు ఏమాత్రం త‌గ్గ‌కుండా భారీ బ‌డ్జెట్‌తో 2.0 ని చెక్కుతున్నాడు శంక‌ర్‌. అయితే మొద‌ట దీపావ‌ళికి వ‌స్తుంద‌నుకున్న 2.0 జ‌న‌వ‌రికి వాయిదా ప‌డిపోయింది. దీంతో నిరాశ ప‌డిన ప్రేక్ష‌కులందరూ సంక్రాంతికి ఫిక్సయిపోయారు.

అయితే ఈ చిత్రం మ‌రోసారి వాయిదా ప‌డ‌బోతుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో అందరిలోనూ అయోమయం నెలకొంది. ఇటీవ‌ల‌ దుబాయ్‌లో అంగరంగ వైభవంగా ఆడియో వేడుక చేసి.. ఇంతలో ఇలా సినిమాను వాయిదా వేసేయడం ఏంటి అనుకున్నారు. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన హైప్ కారణంగా.. ఇది ఎప్పుడొస్తుందన్నదాన్ని బట్టి వేరే సినిమాల రిలీజ్ డేట్లు కూడా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది.

దీంతో 2.0 సినిమా రిలీజ్ ఇటు టాలీవుడ్‌లోనూ.. అటు కోలీవుడ్‌లోనూ గందరగోళం నెలకొంది. ఈ గందరగోళానికి తెరదించకుండా 2.0 టీం సైలెంటుగా ఉండిపోయింది. మీడియాలో మాత్రం 2.0 వాయిదా పడటంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ చిత్ర బృందం ఏమీ స్పందించకపోవడంతో వాయిదా సంగతి నిజమే అనుకున్నారంతా. అయితే ఇంతలోనే కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి.

2.0 వాయిదా పడటం లేదట. యధావిధిగా జనవరి 25నే ఈ సినిమా రిలీజవుతుందట. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ క్రిటిక్ శ్రీధర్ పిళ్లై చెప్పారు. ఆయన ఏదైనా అథెంటిక్ సమాచారం ఉంటేనే ట్వీట్ చేస్తారు. ఆయన ఇలా ట్వీట్ చేస్తారంటే అందులో నిజం ఉండి ఉండొచ్చు. ఈ విషయమై 2.0 నిర్మాతలే ఓ ప్రకటన చేస్తారని ఆయనన్నాడు. మరి ఆ ప్రకటన ఎప్పుడొస్తుందో ఏమో చూడాల‌స‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించ మరి.ుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat