జబర్ధస్త్ షోలో కమెడియన్‌గా సుడిగాలి సుధీర్ ఎంత పాపులర్ అయ్యాడో.. అదే జబర్ధస్త్ యాంకర్ రష్మీతో ఎఫైర్ అంటూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాడు. ఇక వీళ్ళద్దరి గురించి వచ్చిన గాసిప్స్ ఇంకవరి మీద కూడా సోషల్ మీడియాలో వచ్చి ఉండవు. ఇక మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వృత్తి పరమైన ఫ్రెండ్ షిప్పే తప్పా ఇంకేంలేదని చాలా సార్లు చెప్పారు. అయినా కూడా రష్మీ-సుధీర్ పై గాసిప్పులు మాత్రం ఆగవు. ఎందుకంటే వారిద్దరు కలిసి చేసే షోలలో చేసే ఓవర్ యాక్షన్ అటువంటింది.
ఇక వాళ్ళపై వచ్చే లవ్ ఎఫైర్స్ రూమర్స్ అన్నీ పక్కన పెడితే.. తాజాగా మరోసారి సుధీర్ వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ మట్లాడుతూ రష్మీకి తనకి ఎప్పుడో పెళ్లి అయిపోయిందని.. మణికొండలో కాపురం కూడా చేస్తున్నామని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే అది నిజం కాదులేండి.. న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో రష్మీకి మీకు పెళ్లై పోయిందటగా అని సుధీర్‌ని ప్రశ్నించగా.. మీరింకా పెళ్లి వరకే వెళ్ళారు.. మేమిద్దరం మణికొండలో ఒక ప్లాట్ తీసుకుని కాపురం కూడా చేస్తున్నామని రాశారని చెప్పాడు.
ఎవరెన్ని రూమర్లు క్రియేట్ చేసినా నాకు ఫరక్ పడదని.. తనకు ఎంతో గృత్తింపు తెచ్చిన జబర్ధస్ షో మీద కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసాడు. టీవీ షోలు, సినిమాలు లేకపోతె రిక్షా తొక్కుకునైనా నా కుటుంబాన్ని పోసించుకుంటానని చెప్పాడు సుధీర్. దీంతో ఇప్పుడు సుధీర్ చేసిన వ్యాఖ్యలు బుల్లితెర, వెండితెర వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. మరి సుధీర్ చేసిన వ్యాఖ్యల పై యాంకర్ రష్మీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.