దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటి కంటే ఇవాళ 25 శాతం పెరిగినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. కొత్తగా 20,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
286 మంది చనిపోయారు. 26,572 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 1.02 కోట్లకు చేరుకోగా, కరోనాతో 1.48 లక్షల మంది మృతి చెందారు.
కొత్త రకం కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇండియాలో 20కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా 14 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. 20 పాజిటివ్ కేసుల్లో ఢిల్లీలో 8, బెంగళూరులో ఏడు కేసులను గుర్తించారు.