తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 551 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,85,068కు చేరింది.
ఇందులో 2,77,304 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 6231 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 4136 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1533కు చేరింది.
రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53 శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.27 శాతంగా ఉన్నదని ప్రభుత్వం వెల్లడించింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 27,244 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో డిసెంబర్ 27 వరకు 67,50,954 మందికి కరోనా పరీక్షలు చేశారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 54 కేసులు ఉన్నాయి.