కరోనా మహమ్మారి వలన ఈ ఏడాది సినీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయాయి. రిలీజ్‌కు సిద్దంగా ఉన్న సినిమాలు థియేటర్స్ లేక ఓటీటీలో విడుదలయ్యాయి.
ఏడాది చివరికి వచ్చేసాం కాబట్టి 2020లో గూగుల్‌లో అత్యధికంగా ఏ సినిమాల కోసం వెతికారు అనేది ఒకసారి పరిశీలిస్తే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన దిల్ బెచారే సినిమానే ప్రేక్షకులు అత్యధికంగా వెతికారు. సుశాంత్ సింగ్ చివరి సినిమా ఇదే కావడంతో ఈ సినిమా గురించి బాగా శోధించారు.
తర్వాతి స్థానాలలో సూర్య నటించిన సూరరయ్ పోట్రు నిలిచింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. అజయ్ దేవగణ్ తానాజీ, విద్యా బాలన్ శకుంతలా దేవి, జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా , అక్షయ్ కుమార్ లక్ష్మీ, ఆదిత్యరాయ్ కపూర్, సంజయ్ దత్, అలియా భట్ నటించిన సడక్ 2, టైగర్ ష్రాఫ్ బాఘీ 3, టైగర్ ష్రాఫ్ ఎక్స్ట్రాక్షన్, అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబో చిత్రాలు టాప్ టెన్‌లో నిలిచాయి. ఈ చిత్రాలన్నీ ఓటీటీలోనే విడుదల కాగా, కొన్ని చిత్రాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి.