వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు మృతిచెందారు. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు వద్ద ఆగివున్న ఆటోను ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టాయి.
దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సంగారెడ్డి దవాఖానకు తరలించగా.. మరొకరు మృతిచెందారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. మృతులంతా కూలీలుగా గుర్తించారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు.